Viral Video: చూపులేని ఏనుగుకు మరో గజరాజు సాయం.. మనసులను హత్తుకునే వీడియో
మనుషుల్లో స్నేహ బంధానికి ఇప్పుడు అర్ధాలు మారిపోయాయి. అవసరాల కోసం అడ్డదార్లు తొక్కే పాత్రలే తప్ప.. నిజమైన స్నేహాలు తగ్గిపోయాయి.
మనుషుల్లో స్నేహ బంధానికి ఇప్పుడు అర్ధాలు మారిపోయాయి. అవసరాల కోసం అడ్డదార్లు తొక్కే పాత్రలే తప్ప.. నిజమైన స్నేహాలు తగ్గిపోయాయి. ఫ్రెండ్స్ కోసం ఎంతదూరం అయినా వెళ్లే వ్యక్తులు ప్రస్తుత సమాజంలో అతికొద్దిమంది మాత్రమే ఉన్నారు అని చెప్పాలి. స్నేహం అనే గొప్ప బంధం.. నోరు లేని మూగజీవాల్లో ప్రస్పుటంగా కనిపించడం గమనించదగ్గ విషయం. తాజాగా చూపులేని ఏనుగుకు మరో ఏనుగు సాయం చేస్తున్న ఈ దృశ్యం..సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఈ స్నేహానికి దాసోహం అంటున్నారు.
ముందుగా వీడియో వీక్షించండి…
View this post on Instagram
మామూలుగానే ఏనుగులు తమ కుటుంబ జీవితానికి ఎంతో ప్రాధాన్యమిస్తాయి. అన్నీ కలిసికట్టుగా.. గుంపుగా జీవిస్తుంటాయి. ఒకదానికి ఒకటి సాయం చేసుకుంటాయి. ఒకదానికి కష్టం వస్తే.. ఏకంగా ఏనుగుల గుంపే దిగివస్తుంది. అలాగే, ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో మూడు ఏనుగుల్లో ఒక ఏనుగుకు చూపులేదు. దీంతో ఆ ఏనుగు ఆహారాన్ని వెతుక్కోవడానికి ఇబ్బందిపడుతోంది. దాని కష్టాన్ని చూసి అర్థం చేసుకున్న మరో ఏనుగు సాయం చేయడానికి ముందుకొచ్చింది. ఆ ఏనుగు ఆహారం తినేందుకు వీలుగా తోడ్పడింది. ఆహారం ఉన్న ప్రాంతం వరకు దాన్ని తీసుకెళ్లింది. వీటి స్నేహం చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మనుషులు సైతం వీటిని చూసి ఎంతో నేర్చుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
Also Read: జగిత్యాల జిల్లాలో భారీ పాముని మింగిన కొండ చిలువ.. షాకింగ్ విజువల్స్