Python Video: జగిత్యాల జిల్లాలో భారీ పాముని మింగిన కొండ చిలువ.. షాకింగ్ విజువల్స్
కప్పని పాము మింగిన సందర్బాలు మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ పామును, మరో పాము మింగడం మాత్రం చాలా అరుదనే చెప్పారలి. అయితే...
కప్పని పాము మింగిన సందర్బాలు మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ పామును, మరో పాము మింగడం మాత్రం చాలా అరుదనే చెప్పారలి. అయితే, ఒక జాతికి చెందిన జంతువు, అదే జాతి జంతువు లేదా క్షీరదం తినడాన్ని కానిబాలిజం అని అంటారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల జిల్లా జాబితా పూర్ గ్రామం శివారు పొలంలో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ భారీ పామును, భారీ కొండ చిలువ మింగుతూ కనిపించింది. సదరు కొండ చిలువ ఎంత ఆకలితో ఉందో, ఏమో కానీ మరో పామును ఆవురావురుమంటూ మింగేస్తూ కనిపించింది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మొబైలో ఫోన్లలో ఈ షాకింగ్ దృశ్యాన్ని రికార్డ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
వీడియో వీక్షించండి…
చెట్టు మీద 11 అడుగుల పాము
ఇటీవల బ్యాంకాక్‌లోని బెంజసిరి పార్క్ మార్గంలో ఉదయాన్నే వాకింగ్ చేస్తున్న వ్యక్తులకు చెట్టు మీద 11 అడుగుల భారీ పాము వేలాడుతూ కనిపించింది. దీంతో వారంతా షాకయ్యారు అది ఎవరి మీదైనా పడుతుందేమోననే భయంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ పామును పట్టుకొనేందుకు ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ ప్రాంతంలో పెద్ద, పెద్ద బిల్డింగ్స్, మాల్స్ ఉన్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పామును పట్టుకొనేందుకు ప్రయత్నించారు. ఆ చెట్టుకు ఎదురుగా ఉన్న భవనం మీదకు ఎక్కి ఆ పాము జాగ్రత్తగా పట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Also Read: భరతమాతకు జై కొట్టిన వార్నర్.. ఇంటర్నెట్‌లో వీడియో వైరల్.