Viral Video: వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. ఏకంగా పెళ్లి వేదిక నుంచే పారిపోయాడు.. షాకైన బంధువులు

Groom runs away from Wedding venue: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని

Viral Video: వరుడికి చిర్రెత్తుకొచ్చింది.. ఏకంగా పెళ్లి వేదిక నుంచే పారిపోయాడు.. షాకైన బంధువులు
Groom Runs Away From Wedding Venue
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 19, 2021 | 2:02 PM

Groom runs away from Wedding venue: సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇలాంటి వీడియోల్లో కొన్ని నవ్వులు పూయిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. ఈ వీడియో మాత్రం కొంత డిఫెరెంట్‌గా ఉంది. వివాహ వేడుకలో వరుడు, వధువు వారి వారి కుటుంబసభ్యులు ఎంతో సంయమనంతో వ్యవహరిస్తుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు. వధువుపై కోపం వచ్చిన వరుడు.. పెళ్లి వేదిక నుంచి పరారయ్యాడు. అవును మీరు వింటున్నది నిజమే.. ఏదో విషయంలో అలిగిన వరుడు.. వేదిక మీద నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ నవ్వుకుంటున్నారు. వరుడు అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమోచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియోలో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంటుంది. ఈ క్రమంలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వెంట వారి కుటుంబసభ్యులు ఉంటారు. ఈ క్రమంలో సింధూర్ కార్యక్రమం జరగాల్సి ఉంటుంది. వరుడు వధువుకి తిలకం దిద్దేందుకు సమాయత్తమవుతాడు. ఈ క్రమంలో వధువు కొంచెం తప్పుకుంటుంది. ఇక అంతే.. చిర్రెత్తుకొచ్చిన వరుడు.. పెళ్లి మండపం నుంచి కిందకు దిగుతాడు. ఈ క్రమంలో అతని తలపాగాను, దండను విసిరేస్తూ వెళ్లిపోతాడు. వైరల్ వీడియో..

విహహ వేదిక వద్ద ఏమి జరిగిందనేది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలీదు. అయితే.. ఈ వీడియోను నిరంజన్ మోహపాత్రా.. ఇన్‌స్టాలో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Also Read:

Viral Video: కారును ఇలా కూడా పార్క్ చేస్తారా.? నవ్వులు పూయిస్తున్న వైరల్ వీడియో.!

Viral Video: మాస్క్ లేకుండా ట్రైన్ ఎక్కిన యువకుడు.. ప్లాట్‌ఫాం పైకి నెట్టేసిన మహిళలు..