AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BharatPe offers: భారీ ఆఫర్లను ప్రకటించిన భారత్‌పే.. BMW బైక్, ఆపిల్ ఐప్యాడ్ ఫోన్లు..

BharatPe offers BMW bikes: భారతదేశపు అతిపెద్ద మర్చంట్ పేమెంట్ అండ్ లెండింగ్ నెట్‌వర్క్ సంస్థ భారత్‌పే భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇది గత నెలలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్ పేబ్యాక్ ఇండియాను...

BharatPe offers: భారీ ఆఫర్లను ప్రకటించిన భారత్‌పే.. BMW బైక్, ఆపిల్ ఐప్యాడ్ ఫోన్లు..
Bharatpe Offers Bmw Bikes
Sanjay Kasula
|

Updated on: Jul 19, 2021 | 6:52 PM

Share

భారతదేశపు అతిపెద్ద మర్చంట్ పేమెంట్ అండ్ లెండింగ్ నెట్‌వర్క్ సంస్థ భారత్‌పే భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇది గత నెలలో అతిపెద్ద మల్టీ-బ్రాండ్ లాయల్టీ ప్రోగ్రామ్ పేబ్యాక్ ఇండియాను కొనుగోలు చేసింది. POS కేటగిరీ కింద తన కొత్త ఉద్యోగుల కోసం బంపర్ జాయినింగ్ పెర్క్ ప్రకటించింది. ఈ పెర్క్ కింద, బిఎమ్‌డబ్ల్యూ బైక్(BMW G310R), ఆపిల్ ఐప్యాడ్ ప్రో(Apple iPad Pro), శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ కొత్త ఉద్యోగికి బహుమతిగా ఇస్తోంది. ఇది కాకుండా నవంబర్‌లో జరిగే ICC మెన్స్ T20 ప్రపంచ కప్ సందర్భంగా ఈ ఆఫర్లు అంటూ పేర్కొంది.

భారత్‌పే తన బిజినెస్‌ను మరింత విస్తరించేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ప్రణాళిక ప్రకారం  రాబోయే కొద్ది రోజుల్లో వ్యాపారులు, వినియోగదారు రుణాల రంగంలో కంపెనీ కొన్ని కొత్త ఉత్పత్తులను ప్రారంభించనుంది. ఇందుకోసం ఇది తన టీమ్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే మార్చి 2022 నాటికి.. సంస్థ తన జట్టు బలాన్ని మూడు రెట్లు పెంచాలని చూస్తోంది . ఇందుకోసం సంస్థ తన టీమ్ సభ్యులను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా  100 మంది కొత్త వ్యక్తులను చేర్చుకుంటోంది.  

ప్రతిభ ఉన్న యువతకు అవకాశం..

తన కంపెనీలోకి మంచి ప్రతిభ కలిగిన యువతకు అవకాశం ఇవ్వాలని చూస్తోంది. ఇందు కోసం కొత్త ఉద్యోగులకు రెండు రకాల ప్యాకేజీలను అందిస్తోంది. మొదటి ప్యాకేజీ “బైక్ ప్యాకేజీ” … రెండవ ప్యాకేజీ “గాడ్జెట్ ప్యాకేజీ”. బైక్ ప్యాకేజీ కింద సంస్థ కొత్త ఉద్యోగికి 5 సూపర్ బైకుల ఎంపికను ఇస్తోంది. ఇందులో బిఎమ్‌డబ్ల్యూ జి 310 ఆర్(BMW G310R), జావా పరేక్(Jawa Parek), కెటిఎం డ్యూక్ 390(KTM Duke 390), కెటిఎం ఆర్‌సి 390(KTM RC 390), రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ ఎంపికలుగా ఇవ్వనున్నారు.

గాడ్జెట్స్ ప్యాకేజీ..

మరోవైపు, గాడ్జెట్స్ ప్యాకేజీ కింద కంపెనీ కొత్త ఉద్యోగులకు ఆపిల్ ఐప్యాడ్ ప్రో (పెన్సిల్‌తో) (Apple iPad Pro), బోస్ హెడ్‌ఫోన్స్(Bose Headphone), హర్మాన్ కార్డాన్ స్పీకర్లు(Harman Kardon Speaker), శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్(Samsung Galaxy Watch), డబ్ల్యూఎఫ్‌హెచ్ డెస్క్(WFH desk) & చైర్ , ఫైర్‌ఫాక్స్ టైఫూన్ 27.5 డి సైకిల్‌ను సైక్లింగ్ కోసం ఇస్తోంది.

మరో బిగ్ బొనాంజా..

అంతే కాదు.. తన ఉద్యోగులకు మరో బిగ్ ఆఫర్ ప్రకటించింది. ICC పురుషుల T 20 ప్రపంచ కప్ అక్టోబర్ నెల నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీని దుబాయ్‌లో నిర్వహించనున్నారు. సంస్థ తరపున తన జట్టులోని ఉద్యోగులందరినీ మ్యాచ్ చూపించడానికి దుబాయ్‌కు తీసుకువెళతారు.

ఇవి కూడా చదవండి: Childhood Love-Murder: ప్రియుడి మోజులో భర్తకు స్పాట్‌.. చిన్ననాటి ప్రేమికుడి కోసం భర్తను ఖతం చేసిన భార్య..

Viral Video: కుక్క నటన… పిల్లి గాండ్రింపు.. ఇది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు..