MLA Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా.. కారణం ఏమిటంటే?
MLA Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ వాయిదా పడింది. తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు హాజరు కాలేనని ఆయన పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించి.. దురుసుగా ప్రవర్తించిన కేసులో కౌశిక్ రెడ్డిపై కేసు నమోఒదైంది..
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విచారణ జనవరి 6కు వాయిదా పడింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించి.. దురుసుగా ప్రవర్తించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై శుక్రవారం ఉదయం 10:00 గంటలకు విచారణకు హాజరు కావాలని కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు హాజరు కాలేనని ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
ఈ కేసులో కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది అనుచరులను నిందితులుగా పోలీసులు చేర్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐజీ శివధర్ రెడ్డి తన ఫోన్ టాప్ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో సీఐతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ కేసులో కౌశిక్ రెడ్డిని డిసెంబర్ 6న పోలీసులు అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా.. ఆయనకు కోర్టు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈనెల 27న మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాసబ్ ట్యాంక్ పోలీసుల ముందు హాజరుకావాలని ఆదేశించారు. అయితే తన తండ్రికి గుండె ఆపరేషన్ కారణంగా విచారణకు హాజరు కాలేనని ఆయన చెప్పడంతో.. విచారణ వచ్చే 6కు వాయిదా పడింది.
ఇక కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ బీఆర్ఎస్ నేతఎర్రోళ్ల శ్రీనివాస్ పై కూడా కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి