BJP Bandi Sanjay: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు.. సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..
BJP Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.
BJP Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భారీ అవకతవకలు జరిగాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బుధవారం నాడు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. 317 జీఓ ఆధారంగా ఎక్కడ కూడా బదిలీల ప్రక్రియ జరుగలేదని ఆరోపించారు. ఉపాధ్యాయులకు సమాచారం ఇవ్వకుండానే బదిలీల ప్రక్రియ జరిగిందన్నారు. ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికే మేల్కొని.. 317 జీవోపై సమీక్షించాలని అన్నారు. ఇదే సమయంలో వరి ధాన్యం సేకరణపైనా బండి సంజయ్ స్పందించారు. తెలంగాణలో పండించిన ప్రతి గింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని అన్నారు. ఢిల్లీలో బైయిల్డ్ రైస్ పై చర్చ అంటూ రాష్ట్ర మంత్రులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి స్పదించక పోవడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు. కొమురంభీం జిల్లాలో నెలకొన్న పోడు భూముల సమస్యతో పాటు ప్రాణహిత చేవెళ్ల, సిర్పూర్ పేపర్ మిల్లు సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.
Also read:
Telangana – Agriculture: రైతు బంధు అసలు ఉద్దేశం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి..
Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యంగా కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..