Chennai Metro: చెన్నై మెట్రో రైళ్లలో ఇద్దరు యువకులు ఎఆర్ రెహ్మాన్ సాంగ్‌తో సందడి.. తోటి ప్రయాణీకులు ఫిదా..

Chennai Metro: మతాలు, భాషలు , మాండలికాలు ఎన్ని ఉన్నా ప్రజలను ఒక్కటిగా చేయడానికి.. అలరించడానికి సంగీతం సహాయపడుతుంది. కళకు భాషాబేధం లేదు.. భావం తప్ప.. ఈ విషయం అనాదిగా..

Chennai Metro: చెన్నై మెట్రో రైళ్లలో ఇద్దరు యువకులు ఎఆర్ రెహ్మాన్ సాంగ్‌తో సందడి.. తోటి ప్రయాణీకులు ఫిదా..
Chennai Metro
Follow us
Surya Kala

|

Updated on: Dec 29, 2021 | 5:30 PM

Chennai Metro: మతాలు, భాషలు , మాండలికాలు ఎన్ని ఉన్నా ప్రజలను ఒక్కటిగా చేయడానికి.. అలరించడానికి సంగీతం సహాయపడుతుంది. కళకు భాషాబేధం లేదు.. భావం తప్ప.. ఈ విషయం అనాదిగా రుజువు అవుతూనే ఉంది. తాజాగా    లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏఆర్ రెహ్మన్ సాంగ్ వినిపిస్తే చాలు.. ఆటోమేటిక్ గా సంగీత ప్రియులతో పాటు సామాన్యులు కూడా పెదవి కలుపుతారు.. తమ సంతోషన్ని వ్యక్తపరుస్తారు. తాజాగా కొంతమంది యువకులు రెహమాన్ ఫేమస్ సాంగ్ ను మెట్రోల్ రైల్ లో హమ్ చేశారు. అక్కడ ఉన్న ప్రయాణీకులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ యువకుల పాటకు వంత పాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే…

చెన్నై మెట్రో లో ఓ సుందరమైన దృశ్యం  వైరల్ అవుతుంది. మెట్రో రైళ్లులో ఇద్దరు యువకులు గిటార్ , పియానో ​​వాయిస్తూ.. ఎఆర్ రెహ్మన్ సినిమాలోని ‘ఆతంగార మారమే’ పాటను పాడుతుంటే.. చుట్టుపక్కల ఉన్న ప్రయాణీకులు సంతోషంగా వారితో పాటు తమ పదం కలిపారు.. ఈ సుందరమైన దృశ్యాన్ని మరికొందరు ప్రయాణీకులు తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో 80,000 కంటే ఎక్కువ వ్యూస్ ను సొంతం చేసుకుంది.  900 కంటే ఎక్కువ సార్లు రీట్వీట్ చేయబడింది.

Chennai Metro vibe ! ARR pic.twitter.com/cLU1cuYCgP

— ???? (@anupr3) December 27, 2021

భారతీరాజా దర్శకత్వం వహించిన ‘కిజక్కు సీమయిలే’  సినిమాలోని ‘ఆతంగార మారమే’ పాట.. ఈ సినిమాకు రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా సంగీతం తమిళ గ్రామీణ జానపద సంగీతం నుండి ప్రేరణ పొందింది. అప్పట్లో అనేక ప్రశంసలను కూడా సొంతం చేసుకుంది. ఇదే సినిమా తెలుగులో పల్నాటి పౌరుషం పేరుతో తెరకెక్కింది. ఈ ఆతంగార మారమే సాంగ్ తెలుగులో రాగాల చిలక.. అంటూ ఇక్కడ ప్రేక్షకులను కూడా అలరించింది.

Also Read:   విచిత్రమైన టాటూతో వార్తలు చదివిన న్యూస్ ప్రజెంటర్.. స్టైల్ కోసం కాదట..