Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యంగా కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..

Lungs: కరోనా కాలంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వైరస్ వల్ల లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Lungs: ఊపిరితిత్తుల ఆరోగ్యంగా కోసం ఈ ఆహారాలు తప్పనిసరి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..
Healthy Lungs
Follow us
uppula Raju

|

Updated on: Dec 29, 2021 | 5:33 PM

Lungs: కరోనా కాలంలో ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వైరస్ వల్ల లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటికి తోడు సిగరెట్‌ పొగ, పర్యావరణ కాలుష్యం వల్ల ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD) పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధుల ప్రమాదానికి గురికావచ్చు. ఈ వ్యాధుల వల్ల ఊపిరితిత్తులు బాగా దెబ్బతింటాయి. అందుకే పోషకాలు అధికంగా ఉండే ఆహరాలను తీసుకుంటే వీటి నుంచి బయటపడవచ్చు. ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం

1. బీట్‌రూట్‌, ఆకుకూరలు బీట్‌రూట్‌లో ఊపిరితిత్తుల పనితీరును ఆప్టిమైజ్ చేసే సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరుకు ప్రయోజనం చేకూరుస్తాయని పరిశోధనలో తేలింది. నైట్రేట్లు రక్త నాళాలను సడలించడం, రక్తపోటును తగ్గించడం, ఆక్సిజన్ తీసుకోవడం ఆప్టిమైజ్ చేయడంలో సహాయపడతాయి అదనంగా ఆకుకూరలలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్లు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి అవసరం.

2. మిరియాలు మిరియాలు ఊపిరితిత్తుల సమస్యలకు శక్తివంతంగా పనిచేస్తాయి. ఇందులో నీటిలో కరిగే విటమిన్ సి ఉంటుంది. ధూమపానం చేసే వారికి తగినంత విటమిన్ సి పొందడం చాలా ముఖ్యం. రోజుకు 35 mg విటమిన్ సిని తీసుకోవాలని నిపుణులు సూచించారు.

3. యాపిల్స్ క్రమం తప్పకుండా ఆపిల్ తినడం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలింది. వారానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ యాపిల్స్ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు బాగుంటుంది. మరియు COPD అభివృద్ధి చెందే ప్రమాదం తగ్గుతుంది. యాపిల్ తీసుకోవడం వల్ల ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఫ్లేవనాయిడ్‌లు, విటమిన్ సి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం దీనికి కారణం.

4. గుమ్మడికాయ గుమ్మడికాయలో ఉండే ముదురు రంగు పదార్థం ఊపిరితిత్తుల-ఆరోగ్య-ప్రోత్సాహక మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంటుంది. బీటా కెరోటిన్, లుటీన్, జియాక్సంతిన్‌తో సహా కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ధూమపానం చేసే వ్యక్తులు గుమ్మడికాయ వంటి కెరోటినాయిడ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందవచ్చు.

5. పసుపు పసుపు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కారణంగా మొత్తం శరీరాన్ని బాగు చేస్తుంది. పసుపులో ప్రధాన క్రియాశీలక భాగం అయిన కర్కుమిన్, ఊపిరితిత్తుల పనితీరుకు తోడ్పడుతుంది.

6. టమోటా, టమోటా ఉత్పత్తులు టొమాటోలు, టొమాటో ఉత్పత్తులు లైకోపీన్ కలిగి ఉంటాయి. ఇది కెరోటినాయిడ్ యాంటీఆక్సిడెంట్. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. టమోటా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల ఉబ్బసం ఉన్నవారిలో వాయుమార్గ వాపు తగ్గుతుందని, COPD ఉన్నవారిలో ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందని తేలింది

7. గ్రీన్ టీ గ్రీన్ టీ అనేది ఆరోగ్యంపై అద్భుతమైన ప్రభావాలను చూపే పానీయం. ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఫైబ్రోసిస్ లేదా కణజాలాల మచ్చలను నిరోధిస్తుందని తేలింది.

8. ఆలివ్ నూనె ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ పరిస్థితుల నుంచి రక్షణ పొందవచ్చు. ఆలివ్ ఆయిల్ అనేది పాలీఫెనాల్స్, విటమిన్ ఈతో సహా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మంచిది.

9. పెరుగు పెరుగులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. పరిశోధన ప్రకారం ఈ పోషకాలు ఊపిరితిత్తుల పనితీరును పెంచడంలో సహాయపడతాయి. COPD ప్రమాదం నుంచి రక్షిస్తాయి.

10. కాఫీ కాఫీ కెఫిన్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాఫీ శ్వాసకోశ వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఇది రక్త నాళాలను తెరవడానికి సహాయపడుతుంది. ఇది ఆస్తమా ఉన్నవారిలో స్వల్పకాలిక లక్షణాలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

Flight Traveling: మొదటిసారి విమానంలో ప్రయాణించే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

Silent Heart Attack: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..?

కేలరీలు లెక్కించడం కాదు.. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రశ్న..? బరువు తగ్గాలంటే ఈ విషయం తెలుసుకోండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!