AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేలరీలు లెక్కించడం కాదు.. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రశ్న..? బరువు తగ్గాలంటే ఈ విషయం తెలుసుకోండి..

Weight loss: ఇటీవల ఒక హెల్త్ సెమినార్‌లో ఒక డాక్టర్ బరువు తగ్గడం గురించి అద్భుత ప్రసంగం చేశారు. 'సాధారణంగా జనాలందరు కేలరీలన్ని ఒకటే అనుకుంటారు.

కేలరీలు లెక్కించడం కాదు.. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ప్రశ్న..? బరువు తగ్గాలంటే ఈ విషయం తెలుసుకోండి..
Weight Loss
uppula Raju
|

Updated on: Dec 29, 2021 | 3:58 PM

Share

Weight loss: ఇటీవల ఒక హెల్త్ సెమినార్‌లో ఒక డాక్టర్ బరువు తగ్గడం గురించి అద్భుత ప్రసంగం చేశారు. ‘సాధారణంగా జనాలందరు కేలరీలన్ని ఒకటే అనుకుంటారు. ఉదాహారణకు బీర్ లేదా బ్రోకలీ నుంచి వచ్చే కేలరీలు సమానంగా ఉంటాయి ఈ రెండూ కూడా శరీరంపై ఒకే ప్రభావాన్ని చూపుతాయని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. రోజంతా ఎన్ని కేలరీలు తీసుకున్నారు.. ఎన్ని కేలరీలు ఖర్చు చేశారో లెక్కలు వేసుకుంటూ ఉండటం కూడా సరైన పద్దతి కాదు’ అన్నారు.

తర్వాత బరువు తగ్గడం గురించి ఇలా చెప్పారు.. “అలాంటి వారికి నేనిచ్చే మొదటి సలహా ఏంటంటే వారు కేలరీలను లెక్కించడం మానేయ్యాలి. కడుపు నిండా ఆహారం తినాలి. అప్పుడే వారు మరింత ఆరోగ్యంగా ఉంటారు ఊబకాయం బాధితులైతే సన్నబడతారు. అవును మీరు విన్నది నిజమే.. మీరు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారు లేదా ఎంత ఆహారం తీసుకుంటున్నారు అనేది ప్రశ్న కాదని.. మీరు ఏమి తింటున్నారనేది ప్రశ్న అని” బదులిచ్చారు. మీరు పచ్చి కూరగాయలు, క్యాబేజీ, బ్రోకలీ, దోసకాయ తినడం ద్వారా 300 కేలరీలు తీసుకుంటే మరొకరు బీర్ లేదా బర్గర్ ద్వారా 300 కేలరీలు తీసుకుంటే రెండింటి ఆహారం ఒకేలా ఉండదు. ఈ రెండు కూడా శరీరంపై ఒకే ప్రభావం చూపవని చెప్పారు.

మీరు ఎంత తిన్నారు అనేది ప్రశ్న కాదు. ప్రశ్న ఏమిటంటే మీరు ఏమి తిన్నారు? బరువు తగ్గాలనుకునే వారికి డాక్టర్ మార్క్ ఇచ్చే మొదటి ముఖ్యమైన సలహా కేలరీలను లెక్కించడం మానేయ్యడమే. బదులుగా వారు తమ ఆహారం ఎంత సహజమైనది, ఎంత ప్రాసెస్ చేయబడిందో లెక్కించడని చెప్పారు. నేచురల్ ఫుడ్ ద్వారా 300 క్యాలరీలకు బదులు 600 క్యాలరీలు తీసుకుంటే అది వారి శరీరానికి హాని కలిగించదన్నారు. అదే సమయంలో, ప్రాసెస్ చేసిన ఆహారం నుంచి100 కేలరీలు కూడా శరీరానికి హాని కలిగిస్తాయని చెప్పారు. అందువల్ల డాక్టర్ మార్క్ సలహాను అనుసరించి, మీరు కేలరీలను లెక్కించే అలవాటును వదిలివేయాలి. మీరు ఎంత తింటున్నారో లెక్కించవద్దు ఏమి తింటున్నారో గమనించండి.

Silent Heart Attack: నిశ్శబ్ద గుండెపోటు అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి..?

AISSEE Admit card 2022: సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ అడ్మిట్‌ కార్డు విడుదల.. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి..

Omicron: ఈ దేశంలో ఒమిక్రాన్‌ జాతీయ ముప్పు కాదు.. ఎటువంటి ఆంక్షలు లేవు.. ఎందుకంటే..?