AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Year Celebrations: తగ్గేదెలే అంటే తాటతీస్తాం.. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్

వేడుకల పేరుతో రోడ్లపై రచ్చ చేస్తే తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. కరోనా నిమయ నిబంధనాలను పాటిస్తూ.. వేడుకలు చేసుకోవాలని సూచించారు హైదరాబాద్‌ కొత్త కమిషనర్‌ ఆనంద్‌.

New Year Celebrations: తగ్గేదెలే అంటే తాటతీస్తాం.. న్యూ ఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల వార్నింగ్
New Year Celebrations
Sanjay Kasula
|

Updated on: Dec 29, 2021 | 6:01 PM

Share

31st Night Hyderabad Restrictions: వేడుకల పేరుతో రోడ్లపై రచ్చ చేస్తే తాట తీస్తామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. కరోనా నిమయ నిబంధనాలను పాటిస్తూ.. వేడుకలు చేసుకోవాలని సూచించారు హైదరాబాద్‌ కొత్త కమిషనర్‌ ఆనంద్‌. న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలను జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకలపై కొత్త కమిషనర్ ఆనంద్ తాజా ప్రకటన జారీ చేశారు. న్యూ ఇయర్‌పార్టీల్లో డీజేలకు అనుమతి లేదన్నారు.  పబ్‌లు, రెస్టారెంట్లకు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.  కొవిడ్ రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈవెంట్లకు పరిమితి మించి పాసులను జారీ చేయవద్దని హెచ్చరించారు.

అలాగే పార్టీల్లో డ్రగ్స్‌ పట్టుబడితే.. కఠిన చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. రెండు డోసులు తీసుకున్న వారికి మాత్రమే ఈవెంట్లకు అనుమతి ఉందని పేర్కొన్నారు.  జనాల్లోకి సింగర్స్‌ వెళ్లకూడదని.. ఈ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలని ఆయన వివరించారు.

రాత్రి 11 గంటల నుంచి ఉ.5 వరకు ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లుగా వెల్లడించారు.  తాగి రోడ్లపై హంగామ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే తీవ్ర చర్యలు తప్పవని అన్నారు.  31న రాత్రి ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామన్నారు సీవీ ఆనంద్. మాస్క్ లేకుండా కనిపిస్తే జరిమానాలు విధిస్తామన్నారు. కాగా.. డిసెంబర్‌ 31 వ తేదీన.. అర్థరాత్రి 12 గంటల వరకు వైన్స్‌ ఒపెన్ ఉంచుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..

CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..