AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana – Agriculture: రైతు బంధు అసలు ఉద్దేశం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి..

Telangana - Agriculture: తెలంగాణలో రెండో రోజు కూడా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయ్యాయి. రెండో రోజు రూ.1255.42 కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో...

Telangana - Agriculture: రైతు బంధు అసలు ఉద్దేశం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి..
Niranjan Reddy
Shiva Prajapati
|

Updated on: Dec 29, 2021 | 5:38 PM

Share

Telangana – Agriculture: తెలంగాణలో రెండో రోజు కూడా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అయ్యాయి. రెండో రోజు రూ.1255.42 కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో పడ్డాయి. నిన్న, నేడు కలిపి మొత్తం రూ. 1799.99 కోట్లు రైతుల ఖాతాలలోకి వేశారు. ఇప్పటి వరకు 17,31,127 మంది లబ్దిదారుల ఖాతాల్లో నిధులు జమ అయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయమైన బుధవారం నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతు కష్టం తెలిసిన నేత కేసీఆర్ అని ప్రశంసించారు. రైతుబంధు ఉద్దేశం డబ్బుల పంపిణీ కాదని, సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగంలోని ప్రతి ఎకరం సాగులోకి రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం అని పేర్కొన్నారు. గత ఏడేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వ్యవసాయ అనుకూల విధానాలతో పంటల ఉత్పత్తులు వందశాతం పైగా పెరిగాయని అన్నారు.

సాగు, పంట ఉత్పత్తులు పెరగడంతో అనేక రంగాలకు ఉపాధి లభించిందన్నారు. వ్యవసాయాన్ని వ్యాపార రంగంగా కాకుండా.. ప్రభుత్వాలు ఉపాధిరంగంగా చూడాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. అప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారాయన. దేశంలో వ్యవసాయాన్ని ఉపాధిరంగంగా చూసిన ఏకైక నేత ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు మంత్రి. దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉందని, అందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంటనే వ్యవసాయ రంగం మీద దృష్టి సారించారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రూ.60 వేల కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చుపెడుతున్నారని చెప్పుకొచ్చారు. కరోనా విపత్తులో ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోయినా రైతుల కోసం రైతుబంధు వంటి వ్యవసాయ పథకాలను కొనసాగిస్తున్నారని చెప్పారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.

Also read:

Beypore Water Fest: గోవాను మించిన బేపూర్ వాటర్ ఫెస్ట్.. క్యూ కడుతున్న టూరిస్టులు..

Evil Fish: చెరువులో చేపలన్నీ మాయం.. ఆ ‘దెయ్యం’ చేప పనే అంటున్న మత్స్యకారులు..

విడాకులు తీసుకున్న సంవత్సరం తర్వాత అధికారికంగా ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..