Evil Fish: చెరువులో చేపలన్నీ మాయం.. ఆ ‘దెయ్యం’ చేప పనే అంటున్న మత్స్యకారులు..

Evil Fish: చెరువుల్లోని చేపలకు ముప్పు ఏర్పడిందా.. అంటే అవుననే అంటున్నారు మత్స్యకారులు. చెరువుల్లోని చేపలు చెరువులోనే మాయమవుతున్నాయి.

Evil Fish: చెరువులో చేపలన్నీ మాయం.. ఆ ‘దెయ్యం’ చేప పనే అంటున్న మత్స్యకారులు..
Evil Fish
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 29, 2021 | 5:09 PM

Evil Fish: చెరువుల్లోని చేపలకు ముప్పు ఏర్పడిందా.. అంటే అవుననే అంటున్నారు మత్స్యకారులు. చెరువుల్లోని చేపలు చెరువులోనే మాయమవుతున్నాయి. లక్షల్లో చేపపిల్లలు వదిలితే వేలల్లోనే మిగులుతున్నాయి. అందుకు కారణం.. దెయ్యం చేప అని అంటున్నారు. చిన్నచేపల్ని తిని బతికే దెయ్యం చేప ఇప్పుడు మన చెరువుల్లోకి ప్రవేశించింది. అందుకే చేపల దిగుబడి కూడా భారీగా తగ్గిందంటున్నారు. దెయ్యం చేప దొరికితే భూమిలో పాతిపెట్టాలని సూచిస్తున్నారు అధికారులు. ఇంతకి మన ప్రాంతంలో లభించని ఈ చేప ఇక్కడికి ఎలా వచ్చింది.

మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు వరుసగా అరుదైన, ప్రమాదకరమైన దెయ్యం చేపలు దొరుకుతున్నాయి. ఇది అరుదైన చేప. అంతేగక ప్రమాదకరమైంది కూడా. తనకన్న చిన్న చేపల్ని తిని బతికే ఈ చేప మన ప్రాంతానికి చెందింది కాదు. క్యాట్ ఫిష్ జాతికి చెందిన ఈ దెయ్యం చేప.. ఈ ప్రాంతానికి ఎలా వచ్చింది. ఇది గనుక మనుగడ సాగిస్తే మత్య్స కారులు భారీగా నష్టపోవడమే గాక మిగతా చేపల మనుగడ కూడా కష్టంగా మారుతుంది.

క్యాట్ పిష్ జాతికి చెందిన ఈ చేపను ఈ ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారి. అమెరికాలో అమెజాన్ నదిలో లభించే ఈ చేప ఇక్కడ లభించడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. దీనిని దెయ్యం చేప, బల్లిచేప అని కూడా పిలుస్తారు. దీన్ని ఆక్వేరియంలలో పెంచుతారు. అమెజాన్ సైల్ఫీన్ క్యాట్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఇలాంటి చేప ఎప్పడు చూడలేదని జాలర్లు చెబుతున్నారు. వింత ఆకారంలో ఉన్న ఈ చేపను చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. క్యాట్ ఫిష్ జాతీకి చెందిన ఈ చేప వింతగా శరీరంపై ముళ్లు కలిగి చూడ్డానికి భయంకరంగా ఉంది. దీని మాంసం కూడా ఎరుపు రంగులో ఉంటుంది. సాగు చేసే చేపల్ని తినేసి, రైతులకు నష్టం కలిగించే ఈ చేపలు మత్స్యకారుల వలల్ని కూడా నాశనం చేస్తున్నాయి. అత్యంత హానికరమైన ఈ చేప నీరు లేకపోయినప్పటికీ 15 రోజులకుపైగా బతకగలదు. నీటిలోనే కాకుండా భూమిపైనా ప్రయాణిస్తూ సమీపంలోని జలాల్లోకి ప్రవేశించి అక్కడ తమ సంతతిని పెంచుకోగలదని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇతర చేపలతో పోల్చుకుంటే ఈ చేప తన సంతతిని అతి వేగంగా పెంచుకుంటుంది.

ఇంతకు ఈ చేప మహబూబ్ నగర్ చెరువుల్లోకి ఎలా వచ్చింది. గతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి చేపలు ఎన్నడూ చూడలేదు. అలాంటి జాతి చేపలు కూడా ఈ ప్రాంతంలో కనిపించలేదు. కానీ ఇప్పుడు తరచూ దెయ్యపు చేప(డెవిల్ ఫిష్) చెరువుల్లో దొరుకుతోంది. ఇతర ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి చేపలు వలస వచ్చే అవకాశం లేదు కాబట్టి విత్తన చేపల్లో ఈ చేప పిల్లలు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పుడు అవి పెరిగి తన సంతతిని పెంచుకుంటున్నాయని మత్య్సకారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ నుంచి రెండు కేజీల బరువున్న దెయ్యపు చేపలు చెరువుల్లో దొరుకుతున్నాయి. వీటిని అరికట్టక పోతే మిగతా చేపల మనుగడ అంత సులువు కాదు.

మిగతా చేపల్ని తినే ఈ దెయ్యపు చేప.. చేపల సాగులో రైతులకు నష్టాన్ని కలిగిస్తోంది. దెయ్యం చేప మిగతా చెరువులకు వ్యాపించినట్లైతే మత్య్సకారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేగాక ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్యసంపద తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి తగ్గిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. తాము వేసిన విత్తన చేపల్లో ఇరవై శాతం చేపలు కూడా తమకు దక్కడం లేదని, దిగుబడి భారీగా తగ్గిపోయిందని మత్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే మత్య్సకారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. క్యాట్ ఫిష్ జాతికి చెందిన చేప అని మిగతా చేపలను తిని బతికే అలవాటు దీనికి ఉంటుందని అంటున్నారు మత్య్స శాఖ అధికారులు. ఈ చేప దొరికినట్లైతే భూమిలో పాతి పెట్టాలని సూచిస్తున్నారు అధికారులు. మత్య్సశాఖ అధికారులు స్పందించి దెయ్యం చేప నివారణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మత్య్సకారులను నష్టం నుంచి కాపాడాల్సిన బాధ్యత అధికారుల పై ఉంది.

Also read:

New Zealand: విచిత్రమైన టాటూతో వార్తలు చదివిన న్యూస్ ప్రజెంటర్.. స్టైల్ కోసం కాదట..

Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌పై రూ.25 తగ్గించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..

Delhi Airport: వామ్మో ఇదే ప్లాన్ రా అయ్యా.. ఆమె నోరు విప్పకపోతే ప్రాణాలే పోయేవి..!

అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ చెస్ ఛాంపియన్‌ గుకేష్..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!