Delhi Airport: వామ్మో ఇదే ప్లాన్ రా అయ్యా.. ఆమె నోరు విప్పకపోతే ప్రాణాలే పోయేవి..!
Cocaine Seized: మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకబోతోంది. కొత్త సంవత్సరాన్ని చాలా మంది ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తుంటారు.
Cocaine Seized: మరో రెండు రోజుల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకబోతోంది. కొత్త సంవత్సరాన్ని చాలా మంది ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. మందు, చిందులతో హోరెత్తిస్తారు. దీన్నే ప్లస్‌గా చేసుకుంటున్న డ్రగ్స్ మాఫియా.. డ్రగ్స్ సరఫరాను చేస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోయింది. ఢిల్లీ ఏయిర్ పోర్ట్‌లో మరోసారి భారీగా కొకైన్ పట్టుబడింది. నటుడు సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాలో మాదిరిగా డ్రగ్స్ తీసుకువచ్చిన ఉగాండా దేశస్థురాలి వద్ద రూ. 14 కోట్ల విలువ చేసే కేజీ కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వారం రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా.. వివరాలను ఇప్పుడు వెల్లడించారు అధికారులు.
వివరాల్లోకెళితే.. ఉగాండాకు చెందిన ఓ మహిళ లాగోస్ నుంచి ఢిల్లీ ఏయిర్‌పోర్టుకు చేరుకుంది. ప్రయాణికురాలి ప్రవర్తనలో తేడా ఉండటంతో అధికారులు ఆమెను ప్రశ్నించారు. కస్టమ్స్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా బయటకు వెళ్లే యత్నం చేసింది. ఈ క్రమంలో ప్రయాణికురాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను అధికారుల బృందం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అసలు విషయం చెప్పింది ఆ మహిళ. కొకైన్‌తో నింపిన 91 చిన్న చిన్న క్యాప్సిల్స్‌ని మింగినట్లు వైద్యులకు తెలిపింది ఆ మహిళ. దాంతో ఆమెకు శస్త్ర చికిత్స చేసిన వైద్యులు.. ఆమె ప్రాణాలను కాపాడారు. కడుపులో ఉన్న 91 కొకైన్ క్యాప్సిల్స్‌ను బయటకు తీశారు. వారం రోజుల చికిత్స అనంతరం మహిళ కోలుకుంది. తాజాగా ప్రయాణికురాలిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తుండటంతో కొకైన్‌ను ఢిల్లీకి తరించే యత్నం చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. అయితే, ఆ కొకైన్‌ను ఢిల్లీలో ఎవరికి ఇవ్వడానికి తీసుకువచ్చారనే దానిపై సమాచారం సేకరిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. కాగా, ఒకేసారి 91 క్యాప్సిల్స్ కొకైన్ కడుపులో దాచి తరలించే యత్నం చేయడం ఇదే మొదటి సారి అని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.
Also read:
Ram Gopal Varma: సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనమేంటి ? .. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..