Snowfall: మంచు దుప్పటి కప్పుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బద్రీనాథ్.. ధవళవర్ణ కాంతులతో పలు ప్రాంతాలు కనుల విందు..
Snowfall: ఓ వైపు శీతాకాలం.. మరో వైపు ప్రకృతి మార్పులతో దేశమంతా చలితీవ్రత పెరిగిపోయింది. శీతలగాలులు వీస్తున్నాయి. పగటివేళ్ళలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా..
Snowfall: ఓ వైపు శీతాకాలం.. మరో వైపు ప్రకృతి మార్పులతో దేశమంతా చలితీవ్రత పెరిగిపోయింది. శీతలగాలులు వీస్తున్నాయి. పగటివేళ్ళలో కూడా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో హిమాలయాల సమీపంలోని రాష్ట్రాల్లో శీతల గాలులు వీచడంతో పాటు మంచు వర్షం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని ప్రజలు ప్రాంతాలు హిమపాతంతో తడిచిముద్దవుతున్నాయి. అనేక ప్రాంతాలు ధవళ కాంతులను సంతరించుకున్నాయి.
ఈరోజు ఉత్తరాఖండ్ లో అనేక ప్రాంతాల్లో భారీ మంచు వర్షం కురిసింది. చార్‌ధామ్‌లో ఒకటైన ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం బద్రీనాథ్ ఆలయ పరిసర ప్రాంతాలు మంచు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. బద్రినాథ్ ఆలయాన్ని మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆలయ పరిసరాలు, దాని చుట్టుపక్కల ప్రాంతాలు ధవళ వస్త్రం పరుచుకున్నట్లు మారి వీక్షకులకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి. మనోహరంగా మరీనా ఈ దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.
#WATCH | Uttarakhand: Badrinath Temple and the nearby area covered in a blanket of snow after witnessing heavy snowfall, mercury levels drop. pic.twitter.com/8g2doCEo2k
— ANI (@ANI) December 29, 2021
అయితే శీతాకాలం కావడంతో చార్ ధామ్ గా పిలిచే బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలను కొన్ని రోజుల క్రితమే మూసివేశారు. దీంతో ఈ సుందర దృశ్యాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం భక్తులకు లేదు..