Nitish Kumar: కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్

Covid-19 Third wave: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు

Nitish Kumar: కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
Nitish Kumar
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 29, 2021 | 4:23 PM

Covid-19 Third wave: దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చూస్తుండగానే కేసుల సంఖ్య పదుల నుంచి వందలకు చేరింది. ఈ క్రమంలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందంటూ నితీష్ పేర్కొన్నారు. శీతాకాలం కావడంతో గత సంవత్సరం వలే కోవిడ్ విజృంభణ కొనసాగుతోందన్నారు. బీహార్లో గత 24 గంటల్లో 47 కోవిడ్ కేసులు నమోదైన పరిస్థితులు చూస్తుంటే కరోనా ధర్డ్ వేవ్ మొదలైందని భావిస్తున్నట్లు నితీశ్ కుమార్ వెల్లడించారు.

ఉత్తరాది రాష్ట్రాలైన ఢిల్లీ, యూపీతో పాటు బీహార్, హర్యానా పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు చూస్తుంటే థర్డ్ వేవ్ వచ్చినట్లుగా భావిస్తున్నామన్నారు. బీహార్ పక్క రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చినా బీహార్లో అప్పుడే ఆ పరిస్ధితి రాలేదని.. కానీ జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారున. రోజురోజుకూ పరిస్థితులు విషమిస్తే.. రాత్రి పూట కర్ఫ్యూపై ఆలోచిస్తామంటూ నీతిశ్ స్పష్టంచేశారు.

కాగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దాదాపు 800ల వరకు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Also Read:

PM Narendra Modi: మార్పు అందుకే చేశాం.. ప్రధాని కొత్త కారుపై కీలక వివరాలు వెల్లడించిన ప్రభుత్వ వర్గాలు

Omicron Variant: మరోసారి కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ ముప్పు ఎక్కువే అంటున్న WHO