Omicron Variant: మరోసారి కలవరపెడుతున్న కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ ముప్పు ఎక్కువే అంటున్న WHO

అనుకున్నదాని కంటే వేగంగా విస్తరిస్తోంది కరోనా మహమ్మారి. ఊహించిన దాని కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ యమ డేంజర్‌గా మారుతోంది.

|

Updated on: Dec 29, 2021 | 1:54 PM

కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా మరోసారి కలవరపెడుతోంది. క్రమంగా విస్తరిస్తున్న కేసులు దడ పుట్టిస్తున్నాయి. పాజిటివిటీ రేటు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే.. ఒమిక్రాన్ వ్యాపిస్తుండడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది.

1 / 7
ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 781కి చేరింది. మహారాష్ట్ర, ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 238 నమోదైతే.. మహారాష్ట్రలో 167కి చేరాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు బయటపడ్దాయి.

2 / 7
ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా.. ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఇలాంటి కేసులే తెలంగాణలో 3 వెలుగులోకి వచ్చాయి. ఒమిక్రాన్ పేషెంట్లతో ఎలాంటి కాంటాక్ట్ లేని.. ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్, ఓ గర్భిణితో పాటు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.

3 / 7
గతంలోనే తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు హెచ్చరించారు. గాలి ద్వారా కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుందనీ.. అన్ని వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందని 20 రోజుల క్రితమే చెప్పారాయన. ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే తెలంగాణలో వచ్చిన 62 కేసుల్లో.. 46 మంది టీకా తీసుకోలేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని.. వైరస్ నుంచి తమను తాము కాపాడుకునేందుకు టీకా ఎంతో కీలకమని ప్రభుత్వం చెప్తోంది.

4 / 7
అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా హెచ్చరిక కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ తో ఓవరాల్ ముప్పు చాలా ఎక్కువని డబ్ల్యూహెచ్ వో హెచ్చరించింది. ఒమిక్రాన్ వేరియంట్ డబ్లింగ్ రేటు డెల్టా వేరియంట్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉందని...కేవలం 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపవుతున్నాయని తెలిపింది. వివిధ దేశాల్లో ముఖ్యంగా అమెరికా , యూకేలలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందని.. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకరంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

5 / 7
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ పంజా విసురుతోంది. కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా యూకే, ఫ్రాన్స్‌లలో రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడా లిస్టులో చేరింది అగ్రరాజ్యం అమెరికా. డిసెంబర్ 20-26 మధ్య వారం రోజుల వ్యవధిలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగాయని.. అక్టోబర్ నెలతో పోలిస్తే 11 శాతం పెరుగుదల నమోదైందని తెలిసింది. కేసులు అత్యధికంగా పెరిగింది మాత్రం గత వారంలోనేనని అమెరికా చెబుతోంది. యూఎస్‌లో డైలీ కేసులు రికార్డ్‌ స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల్లోనే 4,41వేలకు పైగా కేసులు వెలుగులోకొచ్చాయి. ఇందులో 58.6శాతం ఒమిక్రాన్‌ కేసులే. ఇక ఈ వారంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 11శాతం పెరిగాయి.

6 / 7
తూర్పు మద్య దేశాలు, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య గతం వారంతో పోలిస్తే సమానంగా ఉంది. అటు ఆఫ్రికన్ ప్రాంతంలో మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ప్రాంతంలో ఏకంగా 72 శాతం మరణాలు సంభవించాయి. అటు దక్షిణ తూర్పు ఆసియాలో 9 శాతం మరణాలుంటే..అమెరికా ప్రాంతంలో 7 శాతం మరణాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 278 మిలియన్ల కోవిడ్ కేసులుంటే..5.4 మిలియన్ల మంది మరణించారు.

7 / 7
Follow us
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!

ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ

జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు

ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..

వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ

దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!

సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ