Coronavirus: నార్సింగి జూనియర్ కళాశాలలో కరోనా కలకలం.. ఒకేసారి 14 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్..
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రెండో దశ ఉద్ధృతి నుంచి పూర్తిగా కోలుకోకముందే చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత భయాందోళనకు గురిచేస్తోంది.
కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. రెండో దశ ఉద్ధృతి నుంచి పూర్తిగా కోలుకోకముందే చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత భయాందోళనకు గురిచేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్‌తో పాటే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. రెసిడెన్సియల్ కాలేజీలోని 14 మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. గత రెండు రోజులుగా తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడుతున్న 90 విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో 14 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
నేడు మరిన్ని టెస్టులు.. కాగా ఒకే కళాశాలలో ఇంత మందికి కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో వైరస్ మరింతగా వ్యాప్తి చెందుకుండా ముందు జాగ్రత్తగా కళాశాల పరిసరాలన్నింటినీ శానిటైజ్ చేశారు. అదేవిధంగా కళాశాలలోని మిగతా 210 మంది విద్యార్ధులకు నేడు ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కు చేరింది.
Also Read:
Andaman and Nicobar Islands: అండమాన్ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత ఎంతంటే..