Omicron: ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఒమిక్రాన్ పాజిటివ్.. తెలంగాణలో కలకలం

Omicron Alert: ఓ వైపు న్యూఇయర్‌ వేడుకలు.. మరోవైపు ఫెస్టివల్ మూడ్‌లో రాష్ట్రాలన్నీ ఉండిపోయాయి. దీంతో ఒమిక్రాన్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది.

Omicron: ట్రావెల్ హిస్టరీ లేకపోయినా ఒమిక్రాన్ పాజిటివ్.. తెలంగాణలో కలకలం
Omicron
Follow us
Ram Naramaneni

| Edited By: Janardhan Veluru

Updated on: Dec 29, 2021 | 11:59 AM

ఓ వైపు న్యూఇయర్‌ వేడుకలు.. మరోవైపు ఫెస్టివల్ మూడ్‌లో రాష్ట్రాలన్నీ ఉండిపోయాయి. ఇదే క్రమంలో ఒమిక్రాన్ వైరస్.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకపోయినా.. ఎలాంటి కాంటాక్ట్ లేకపోయినా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. ఇలాంటి కేసులే తెలంగాణలో 3 వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని ఓ ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్, ఒక ప్రెగ్నెంట్ మహిళ, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటికే 62 ఒమిక్రాన్ కేసులు బయటపడ్దాయి. వారిలో 46 మంది టీకా తీసుకోలేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

ఇప్పటికే ఉన్న వేరియంట్ల కంటే.. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఈ క్రమంలో ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే.. ఒమిక్రాన్ వ్యాపిస్తుండడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది. తెలంగాణలో తొలి డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయింది. వందశాతం లక్ష్యం పూర్తి చేసుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని, వైద్యారోగ్యశాఖ సిబ్బంది కృషి వల్లే లక్ష్యం పూర్తి చేయగలిగామన్నారు మంత్రి హరీశ్ రావు.

అటు దేశ వ్యాప్తంగానూ…

అటు దేశ వ్యాప్తంగానూ ఒమిక్రాన్‌ మళ్లీ దడ పుట్టిస్తోంది. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 781కి చేరింది. మహారాష్ట్ర,ఢిల్లీలో రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో అత్యధికంగా 238 నమోదుకాగా..  మహారాష్ట్రలో 167కి చేరాయి. ఆ తర్వాత గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62 కేసులు బయటపడ్దాయి.

ఓ వైపు న్యూఇయర్‌ వేడుకలు..మరోవైపు వరుస సెలవులతో పలు రాష్ట్రాలు అప్రమత్తమ్యాయి. ఇప్పటికే పదికి పైగా రాష్ట్రాలు నైట్‌ కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఢిల్లీలో మళ్లీ ఆంక్షలు అమలు చేస్తున్నారు. నేటి నుంచి ఎల్లో అలెర్ట్ అమల్లోకి వస్తోంది. సభలు, సమావేశాలపై నిషేధం విధించారు. విద్యాసంస్థలు,సినిమా హాళ్లు,మల్టిప్లెక్స్‌లు బంద్ చేశారు. 50శాతం సామర్థ్యంతో మెట్రో, బస్సులకు అనుమతి ఇస్తున్నారు.

ఒమిక్రాన్‌పై పోరు ఇలా..

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు మాస్క్ తప్పనిసరిగా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హ్యాండ్ వాష్, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ రెండు డోసులు ఇంకా తీసుకోని వారు వెంటనే తీసుకోవాలి. అనవరసరమైన ప్రయాణాలను రద్దు చేసుకోవాలి. వీలైనంత మేరకు జనరద్దీ కలిగిన ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని టీవీ9 కూడా కోరుతోంది..

Also Read: Vangaveeti Radha: రెక్కీ చేసింది అతడే అని ప్రచారం.. రాధాకు చంద్రబాబు ఫోన్

 ఈ ఫోటోలోని చిన్నది.. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?