Ram Gopal Varma: సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనమేంటి ? .. రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం సినిమా టికెట్స్ రేట్స్ విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. సినీ ఇండస్ట్రీకి మధ్య రగడ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా
ప్రస్తుతం సినిమా టికెట్స్ రేట్స్ విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. సినీ ఇండస్ట్రీకి మధ్య రగడ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ క్రమంలో ఇటీవల సినిమా టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై సినీ ప్రముఖులు, నిర్మాతలు, థియేటర్ల యాజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా రేట్స్ తగ్గించాలా ? వద్దా ? అనేది నిర్మాత ఆలోచించాల్సిన విషయమని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆరోపించారు. తాజాగా ఈ అంశంపై సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
వస్తువు ధర నిర్ణయించే అధికారం ఉత్పత్తిదారుడికి ఉన్నప్పుడు సినిమా నిర్మించే నిర్మాతకు టికెట్ రేట్ డిసైడ్ చేసే హక్కు ఎందుకో లేదో చెప్పాలన్నారు. సినిమా టికెట్ రేట్ నిర్ణయించడమేంటో అర్థం కావడం లేదన్నారు ఆర్జీవి. ఉత్పత్తిదారుకే దాని ధరను నిర్ణయించే అధికారం ఉంటుందని.. దానిని కొనాలా ? వద్దా ? అనేది వినియోగదారుల ఇష్టమని.. సినిమా టికెట్ల పై ప్రభుత్వ పెత్తనమేంటీ ? అంటూ ప్రశ్నించారు వర్మ. సినిమా టికెట్స్ రేట్స్ నిర్ణయించేది నిర్మాతలే అని..మూవీ చూడాలా ? వద్దా ? అన్నది ప్రేక్షకుల ఇష్టమని టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ అన్నారు.
పెట్టుబడులు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం భూముల్ని కేటాయించడం లాంటివి చేస్తుంది. ఇవే కాకుండా.. ప్రభుత్వం తరపున ప్రోత్సాహకాలను ఇస్తుంది. తద్వారా ఉద్యోగితా శాతాన్ని పెంపొందించడం వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఇదే అంశం థియేటర్స్‌తో ఉందో లేదో నాకు తెలియదు కానీ.. థియేటర్స్ లో లేకపోతే ఒక వ్యక్తి సినిమా తీస్తాడు. తనకు నచ్చినట్టుగా ఇష్టమైన రేట్లు పెట్టుకుంటాను ఓపిక ఉన్నోడు సినిమా చూస్తాడు.. లేనోడు మానేస్తాడు. ఈ విషయంలో ప్రభుత్వం ఎందుకు కల్పించుకుంటుంది.. ఏ హక్కు ఉంది అంటూ ఆర్జీవి ప్రశ్నించాడు.
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్