Petrol Price: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌పై రూ.25 తగ్గించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం..
దేశంలో పెట్రోల్, డీజిల్ భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. చమురు ధరలు వంద దాటిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తూ
Jharkhand CM Hemant Soren: దేశంలో పెట్రోల్, డీజిల్ భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడున్నారు. చమురు ధరలు వంద దాటిపోవడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ5, డీజిల్‌పై రూ. 10 మేర ఎక్సైజ్ డ్యూటీ సుంకాన్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో చాలా రాష్ట్రాలు కేంద్రానికి మద్దతుగా.. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాయి. రాష్ట్రాలు విధించే ఎక్సైజ్ డ్యూటీని కొంతమేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కేంద్రలాగే.. తమ రాష్ట్రాల్లో కూడా పెట్రోల్‌పై రూ.5 డీజిల్‌పై 10 చొప్పున తగ్గిస్తూ ప్రకటించాయి. ఈ క్రమంలో ఝార్ఖండ్ ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని రాష్ట్రాలు వలే కాకుండా పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు హేమంత్ సోరెన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
లీటర్ పెట్రోల్‌పై రూ. 25 తగ్గిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. తగ్గించిన ధరలు జనవరి 26 నుంచి అమలులోకి వస్తాయని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. ఇది కేవలం ద్విచక్రవాహనదారులకు మాత్రమేనని హేమంత్ సొరెన్ ప్రకటించారు. జేఎంఎం ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం జరిగిన కేబినేట్ భేటీలో హేమంత్ సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
पेट्रोल-डीजल के मूल्य में लगातार इजाफा हो रहा है, इससे गरीब और मध्यम वर्ग के लोग सबसे अधिक प्रभावित हैं। इसलिए सरकार ने राज्य स्तर से दुपहिया वाहन के लिए पेट्रोल पर प्रति लीटर ₹25 की राहत देगी, इसका लाभ 26 जनवरी 2022 से मिलना शुरू होगा:- श्री @HemantSorenJMM pic.twitter.com/MsinoGS60Y
— Office of Chief Minister, Jharkhand (@JharkhandCMO) December 29, 2021
పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం పేర్కొన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెమంత్ సోరెన్ తెలిపారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యకక్రమాలకు సంబంధించిన బుక్‌లెట్‌ను విడుదల చేశారు.
Also Read: