విడాకులు తీసుకున్న సంవత్సరం తర్వాత అధికారికంగా ప్రకటించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..
సినీ పరిశ్రమలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువగానే ఉన్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఇప్పటివరకు విడాకులు తీసుకున్న
సినీ పరిశ్రమలో విడాకులు తీసుకున్న జంటలు ఎక్కువగానే ఉన్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఇప్పటివరకు విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు ఎక్కువగానే ఉన్నారు. చిన్న కారణాలు మనస్పర్థలతో వైవాహిక బంధానికి స్వస్తి చెప్పేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆమీర్ ఖాన్, సమంత-నాగచైతన్య విడాకుల విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ముఖ్యంగా టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్‌గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడిపోవడానికి గల కారణాలు ఏంటీ అని నెటిజన్స్ ఆరా తీసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో జంట తాము విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించారు. విడాకులు తీసుకున్న సంవత్సరం తర్వాతా ఈ జంట విడిపోయినట్టుగా అధికారికంగా ప్రకటించారు. వారిద్దరు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టా్ర్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్.
దాదాపు 13 ఏళ్ల వివాహ జీవితం అనంతరం తన భార్య మోనికా రిచర్డ్ నుంచి విడిపోతున్నట్లుగా ఇమ్మాన్ అధికారికంగా ప్రకటింటారు. వీరు 2020లోనే విడాకులు తీసుకున్నారట. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి..దాదాపు సంవత్సరం తర్వాత సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు.. ” నా శ్రేయోభిలాషులకు, సంగీత ప్రియులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను..నేను, మోనికా రిచర్డ్ నవంబర్ 2020 నాటికి పరస్పర అంగీకారంతో చట్టబద్దంగా విడాకులు తీసుకున్నాం. ఇక పై భార్యభర్తలు కాదు. మీడియాతోపాటు..అందరూ మా ప్రైవసీకి భంగం కలిగించకుండా.. జీవితంలో ముందుకు సాగడానికి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు ” అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.
View this post on Instagram
ఇమ్మాన్.. 2008లో కంప్యూటర్ ఇంజనీర్ మోనికాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరూ కూతుళ్లు. ఇమ్మాన్ అన్నాత్తే సినిమాలు సంగీతం అందించారు. అలాగే అజిత్ నటించిన విశ్వాసం సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు.
Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్