Beypore Water Fest: గోవాను మించిన బేపూర్ వాటర్ ఫెస్ట్.. క్యూ కడుతున్న టూరిస్టులు..
ప్రకృతి అందాలకు నెలవు కేరళ. ఆ అందాలకు వాటర్ ఫెస్టివల్ తోడైంది. ఇక ఎంజాయ్‌కి ఆకాశమే హద్దు అయ్యింది. ఆ అద్భుత విన్యాసాలు మీరూ చూడండి.
అది పురాతన ఓడరేవు నగరం. సముద్రయానం, పడవ తయారీకి పెట్టింది పేరు. ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టింది కేరళ సర్కార్. వాటర్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంను ప్రోత్సహించడానికి నాలుగు రోజుల పాటు బేపూర్ వాటర్ ఫెస్ట్ నిర్వహించింది కేరళ పర్యాటక శాఖ. డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ ఫెస్టివల్ ఇవాళ ముగిసింది. చలియార్ నది ఒడ్డున జరిగిన వాటర్ ఫెస్టివల్‌లో బోట్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నేవీ, కోస్ట్ గార్డ్ ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. 13 రాష్ట్రాలకు చెందిన పతంగులతో నిర్వహించిన నేషనల్ కైట్ ఫెస్టివల్ ఆకట్టుకుంది.
చిన్నాపెద్దా అంతా ఎంజాయ్ చేశారు. బేపూర్ మెరీనా రివర్ కయాకింగ్, స్టాండ్ అప్ పెడలింగ్, వెదురు రాఫ్టింగ్, నేషనల్ కైట్ ఫెస్టివల్, సెయిలింగ్ రెగట్టా వంటి వివిధ వాటర్ స్పోర్ట్స్ ఈవెంట్‌లను నిర్వహించింది కేరళ టూరిజం.
కోవిడ్ మహమ్మారి కారణంగా పర్యాటక రంగానికి 30 వేల కోట్ల నష్టం వాటిల్లింది గత ఏడాది. తిరిగి పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నాయి వివిధ రాష్ట్రాలు. ఇందులో భాగంగా కేరళ టూరిజం స్పెషల్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా టూరిజం మళ్లీ గాడిన పడుతుందని అక్కడి అధికారులు ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..
CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..