Telangana: ఆ జిల్లా నేతలపై గుర్రుగా ఉన్న కిషన్ రెడ్డి.. ఇంతకా నాయకులు ఎవరు, ఆ కథెంటీ.?
ఇతర పార్టీ నుంచి నేతలు తమ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే.. ఆ పార్టీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండాలి కానీ సంగారెడ్డి బీజేపీ నేతలు అలా లేరట ఇప్పుడు ఆ నేతను ఎందుకు పార్టీలోకి తీసుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారట.. ఆ నేత జాయిన్ అయినప్పటి నుంచి పార్టీ అధిష్టానం కూడా ఇక్కడి నేతల పై గుర్తుగా ఉంటున్నారట. సదాశివపేటకి చెందిన బీఆర్ఎస్ నేత పులి మామిడి రాజు...

ఆ జిల్లాకు చెందిన కమలం పార్టీ నేతలకు కొత్త కష్టాలు చుట్టుముట్టాయని తెలుస్తోంది. బీర్ఎస్ పార్టీలో ఉన్న ఓ నేత ఇటీవలే బీజేపీలో చేరినప్పటి నుండి అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నాయని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. వాళ్ళు వీళ్లు కాదు సాక్షాత్ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డే జిల్లా బీజేపీ నేతల పై చాలా గుర్రుగా ఉన్నారని టాక్. ఇందంత ఎక్కడ..?రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడి నేతల పై ఎందుకు అంత సీరియస్ గా ఉన్నారు..? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఇతర పార్టీ నుంచి నేతలు తమ పార్టీలో జాయిన్ అయ్యారు అంటే.. ఆ పార్టీ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండాలి కానీ సంగారెడ్డి బీజేపీ నేతలు అలా లేరట ఇప్పుడు ఆ నేతను ఎందుకు పార్టీలోకి తీసుకున్నామా అని తలలు పట్టుకుంటున్నారట.. ఆ నేత జాయిన్ అయినప్పటి నుంచి పార్టీ అధిష్టానం కూడా ఇక్కడి నేతల పై గుర్తుగా ఉంటున్నారట. సదాశివపేటకి చెందిన బీఆర్ఎస్ నేత పులి మామిడి రాజు సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించి,అది రాకపోవడంతో ఇటీవలే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యాడు.. ఈ కార్యక్రమం స్థానిక అంబెడ్కర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లను చాలా అట్టహాసంగా చేశారు.. ఈ జాయినింగ్ ప్రోగ్రాంకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి..కేంద్ర మంత్రి పురుషోత్తమ రూపాల, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావులు హాజరైనట్లు తెలుస్తోంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక సంగారెడ్డి రావడం ఇదే తొలిసారి.. అయితే తొలిసారి జిల్లాకు వస్తు బహిరంగ సభలో పాల్గొంటున్న నేపథ్యంలో ఈ సభ పై ఆయన కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడని.. కానీ ఇక్కడ మాత్రం అంత సీన్ లేదు అని ఆయనకు మెల్లిగా అర్ధమైందని తెలుస్తోంది. 3 గంటలకు కార్యక్రమం ఉండగా.. 4 గంటల వరకు కిషన్ రెడ్డి సంగరెడ్డికి వచ్చి చేరారు. ఆయన వచ్చిన కూడా ఎమ్మెల్యేలతో పాటు లోకల్ లీడర్ల్ ఎవరు సరిగ్గా అందుబాటులో లేరని సమాచారం. గంటన్నర తర్వాత తీరిగ్గా వచ్చిన నేతలు..కిషన్ రెడ్డికి స్థానిక గెస్ట్ హౌస్ నుండి సభ స్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మీటింగ్ వద్దకు చేరుకోగానే ర్యాలీలో ఉన్న నేతలు అందరూ జంప్ అయ్యారు.
ఇక కిషన్ రెడ్డి సభ వేదిక పై మాట్లాడుతున్నప్పుడు ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో అంతా కంగుతిన్నారు. మందికి కుర్చీలు వేస్తే..కిషన్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు 200 మంది జనాలు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో అసహనానికి గురైన కిషన్ రెడ్డి తన స్పీచ్ ను తొందరగా ముగించేశారు. ఇదిలా ఉంటే పులిమామిడి రాజు జాయినింగ్ ప్రోగ్రాంకు రావడం మొదటి నుండి కిషన్ రెడ్డికి ఇష్టం లేదని పొలిటికల్ సర్కిల్స్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కౌన్సిలర్ గా ఉన్న పులిమామిడి రాజు పార్టీలో చేరుతాడు అని చెప్పగానే..ఆ ప్రోగ్రామ్ మీరే చేసుకొండి తనకు వీలు కాదని కిషన్ రెడ్డి చెప్పినట్లు చర్చ జరిగింది.
సంగారెడ్డి జిల్లా బిజెపీ అధ్యక్షుడు నరేదంర్ రెడ్డి కూడా జిల్లాలో జరిగే ప్రోగ్రామ్ ల పై ఎక్కువ దృష్టి పెట్టకపోవడం కూడా,పులిమామిడి రాజు జాయినింగ్ ప్రోగ్రామ్ అట్టర్ ప్లాప్ కావడానికి ఓ కారణం అని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పార్టీ కార్యలయాలను వర్చువల్ లో ఓపెనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి ఆ ప్రోగ్రామ్ కి హాజరయ్యారు. అప్పుడు కూడా మీటింగ్ లో జనాలు ఎవరు లేకపోవడం గమనార్హం. అది గుర్తుపెట్టుకొనే కిషన్ రెడ్డి ఈ జాయినింగ్ ప్రోగ్రామ్‌కి రాను అని చెప్పినట్లు సమాచారం. స్టేజి ఏర్పాటు పై,టౌన్ లో ఏర్పాటు చేసిన కటౌట్ల పై పెట్టిన దృష్టి.. జన సమీకరణలో కూడా పెట్టాలి అని పులిమామిడి రాజు..జిల్లా అధ్యక్షుడు నరేందర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వీరితో పాటు జిల్లాలో ఉన్న సీనియర్ లీడర్ల పై కూడా అసహనం వ్యక్తం చేశారు.
మొదటిసారి రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో జిల్లాలో జరుగుతున్న బహిరంగ సభకు వస్తే, ఆ సభను సక్సెస్ చేయడంలో మీరు విఫలం అయ్యారు అని లోకల్ లీడర్ల్ పై గుర్రుగా ఉన్నారని బహిరంగానే చర్చించుకున్నారని సమాచారం. పార్టీలో జాయిన్ అయ్యే పులిమామిడి రాజు కూడా గెస్ట్ హౌస్ వద్దే ఉంటు కార్యకర్తలతో సెల్ఫీలు దిగుతూ ఉండడన్ని గమనించిన కిషన్ రెడ్డి, సభ వేదిక జనాలు లేరు అని తనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని మీరు వెంటనే వెళ్లి అక్కడ పరిస్థితిని చూడండి అని పులిమామిడి రాజుతో పాటు, మరి కొంతమంది నేతలకు స్వయాన కిషన్ రెడ్డి చెప్పిన కూడా, వీరు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా చాలా లైట్ తీసుకున్నారని టాక్. ఏది ఏమైనా పులిమామిడి రాజు పార్టీలోకి వచ్చిన వేళ విశేషం సరిగ్గా లేదోమో అని బీజేపీ నేతలు గుసగుసలాడుతున్నారు. వెంకీ పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు..పులిమామిడి రాజు బీజేపీలోకి రావడంతో వీరికి కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
