Telangana: తెలంగాణలో మహిళా ఐఏఎస్‌లకు ఆగని వేధింపులు.. వెలుగులోకి మరో సంఘటన
సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో మహిళ ఐఏఎస్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది..తన కార్యాలయనికి రోజు విజిటర్స్ వస్తూ ఉంటారు ...పనిలో పనిగా ఒక అగంతకుడు సదరు మహిళ ఐఏఎస్ ఆఫీస్ లో ఉందని తెలుసుకుని ఆమె కార్యాలయానికి వెళ్ళాడు..అక్కడ ఉన్న సిబ్బంది తో నేను మేడం కు పెద్ద ఫ్యాన్...సోషల్ మీడియా లో మేడం ను ఫాలో అవుతూ ఉంటాను..

తెలంగాణ ప్రభుత్వంలో మహిళ ఐఏఎస్ లకి వేధింపులు ఆగటం లేదు. కొద్దిరోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఒక ఐఏఎస్ అధికారీ ఇంట్లో అగంతకుడు చొరబడిన విషయం తెలిసిందే.. సదరు విషయాన్ని ఆ మహిళ ఐఏఎస్ అధికారినే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఆందోళనను వ్యక్తపరిచింది. ఈ ఘటన మరువక ముందే మరో తెలంగాణ ఐఏఎస్ అధికారానికి మరో అగంతకుడు నుండి వేధింపులు మొదలయ్యాయి.
సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ప్రభుత్వ కార్యాలయంలో మహిళ ఐఏఎస్ డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది..తన కార్యాలయనికి రోజు విజిటర్స్ వస్తూ ఉంటారు …పనిలో పనిగా ఒక అగంతకుడు సదరు మహిళ ఐఏఎస్ ఆఫీస్ లో ఉందని తెలుసుకుని ఆమె కార్యాలయానికి వెళ్ళాడు..అక్కడ ఉన్న సిబ్బంది తో నేను మేడం కు పెద్ద ఫ్యాన్…సోషల్ మీడియా లో మేడం ను ఫాలో అవుతూ ఉంటాను..ఒక్కసారి కలిపించండి అంటూ ఐఏఎస్ ఆఫీస్ సిబ్బంది వెంటపడ్డాడు…విషయం తెలుసుకున్న సిబ్బంది ఐఏఎస్ వరకు ఈ మ్యాటర్ చెప్పారు ..ఎట్టి పరిస్థితిలో ఎలాంటి వారిని లోపలకి అనుమతి ఇవ్వద్దు అంటూ సదరు ఐఏఎస్ హుకుం జారీ చేసింది..
నేను మీ ఫ్యాన్ అంటూ స్వీట్ బాక్స్ తీసుకెళ్లిన అగంతకుడు…
కార్యాలయంలో ఎలాగూ సిబ్బంది కలవనివడం లేదని ఐఏఎస్ ఇంటి అడ్రస్ కనుకొన్నడు అగంతకుడు .. స్వీట్ బాక్స్ తీసుకుని నేర్గుగా ఐఏఎస్ ఇంటికి వెళ్ళాడు శివ ప్రసాద్.అక్కడ అతడి రాక గమనించిన సిబ్బంది ఐఏఎస్ కు తెలిపారు..దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఐఏఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయమని తన సిబ్బందికి ఆదేశించారు…ఐఏఎస్ అదేశాలతో మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐఏఎస్ కార్యాలయ సిబ్బంది..అడిషనల్ డెరైక్టర్ పరమేశ్వర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివ ప్రసాద్ పై కేస్ నమోదు చేశారు మార్కెట్ పోలీసులు.ఇత్తడి పై క్రైమ్ నెంబర్ 190 కింద మార్కెట్ పోలీస్ స్టేషన్ లో కేస్ నమోదు చేశారు..పలు సెక్షన్ లు పెట్టీ శివ ప్రసాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మహిళ ఐఏఎస్‌లు..
అయితే కొద్ది నెలల క్రితం తెలంగాణ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు సైతం ఇదే రీతిలో వేధింపులు ఎదురయ్యాయి. ఆ కేసులో ఏకంగా ఐఏఎస్ ఇంటికి వెళ్లి మరి ఇబ్బందికి గురి చేశాడు ఒక అగంతకుడు. అయితే మహిళ ఐఏఎస్‌లు తాము చేసే ప్రతీ యాక్టివిటీని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.. దీంతో సాధారణంగానే మహిళ ఐఏఎస్ లకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. సామాన్యులకు వీరి సోషల్ మీడియా పోస్టులు త్వరగా రీచ్ అవుతూ ఉంటాయి. వీటిని ఆసరాగా చేసుకొని ఎలాగైనా సరే ఐఏఎస్ ని కలవాలి అనుకొని పనిగట్టుకొని మరి ఐఏఎస్ ల కార్యాలయాలకు వెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇలాంటి పోకిరీలు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
