AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది కేసీఆరే.. కాంగ్రెస్‌, బీజేపీపై హరీష్‌ అటాక్‌

కాంగ్రెస్‌, బీజేపీలది తిట్లలో పోటీ అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిట్లతో పోటీ పడుతుందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ది బట్ట కాల్చి మీద వేసే సంస్కృతి అని, ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది అని, కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి అయితే.. BRS పార్టీది టన్నుల పంట పండించే సంస్కృతని చమత్కరించారు...

Telangana: ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది కేసీఆరే.. కాంగ్రెస్‌, బీజేపీపై హరీష్‌ అటాక్‌
TS Minister Harish Rao
P Shivteja
| Edited By: |

Updated on: Sep 16, 2023 | 8:30 PM

Share

సిడబ్ల్యుసి మీటింగ్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ ట్రిక్కులు చేస్తుంది ఎవరన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ కొట్టేది ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ ప్రజలను గ్యారంటీల పేరిట మోసం చేయడం కుదరదని..తెలంగాణకు పర్మినెంటు గ్యారంటీ కేసీఆర్ మాత్రమే అన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఈ రోజు అమిత్ షా వచ్చి తిడుతారు, రేపు ఖర్గే వచ్చి తిడుతారు అని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌, బీజేపీలది తిట్లలో పోటీ అయితే.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిట్లతో పోటీ పడుతుందని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ది బట్ట కాల్చి మీద వేసే సంస్కృతి అని, ప్రతిపక్షాల పాలనకు మా పాలనకు నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా ఉంది అని, కాంగ్రెస్ పార్టీది తన్నుల సంస్కృతి అయితే.. BRS పార్టీది టన్నుల పంట పండించే సంస్కృతని చమత్కరించారు. ఈరోజు తెలంగాణ భారతదేశానికి దిక్సుచిగా మారిందని, దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ ఎన్నో అవార్డులు సాధించింది అని, ధాన్యం ఉత్పత్తిలో హర్యానా, పంజాబ్ లను దాటి కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణ మారిందని మంత్రి హరీష్‌ రావు చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తే.. పాలమూరు ప్రాజెక్టు దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేస్తుందన్నారు మంత్రి. దేశ వైద్య అవసరాలు తీర్చేందుకు వేల మంది డాక్టర్లును తయారు చేస్తున్నామన్న మంత్రి హరీష్‌ రావు.. కాంగ్రెస్ వాళ్లు గొప్పలు చెప్పి చెవిలో పువ్వులు పెడతారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ చేసేందేమి లేదన్న మంత్రి.. కాంగ్రెస్ పార్టీవి అన్ని వట్టి మాటలే అని… కేసీఆర్ సర్కార్ చేతల ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.

ఆ ఎమ్మెల్యే అడ్రస్‌ ఎవరికీ తెలియదు..

కేసీఆర్ పక్క హిందూ… కానీ కుల మతాలకు అతీతంగా పని చేస్తారు అన్నారు.. సీఎం కేసీఆర్ అద్భుతాలు సృష్టిస్తున్నారు అని..కాంగ్రెస్ వాళ్లు అబద్ధాలు చెబుతున్నారని మండి పడ్డారు.. ఆనాడు మెదక్ జిల్లా ప్రజల నోట్లో మట్టి కొట్టి సింగూర్ నీళ్ళను హైదరాబాద్‌కి తీసుకెళ్లి చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు.. మరో వైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గరెడ్డి పై కూడా సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. ఎమ్మెల్యేగా జాగ్గారెడ్డి గెలిచినప్పటి నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేడు అని.. ఆ ఎమ్మెల్యే అడ్రస్ ఎక్కడో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు అన్నారు. ఆయన ఎక్కడున్నాడో తెలియదు అని కనీసం ఆయన ఫోన్ నెంబర్ కూడా ఎవరి వద్ద ఉండదంటూ మంత్రి హరీష్‌ విమర్శల వర్షం కురిపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్