తెలంగాణలో జాతీయ పార్టీల వ్యూహాలేంటి ? కౌంటర్‌గా బీఆర్ఎస్‌ యాక్షన్ ప్లానేంటి?

తెలంగాణలో జాతీయ పార్టీల వ్యూహాలేంటి ? కౌంటర్‌గా బీఆర్ఎస్‌ యాక్షన్ ప్లానేంటి?

Ram Naramaneni

|

Updated on: Sep 16, 2023 | 9:12 PM

తెలంగాణలో ఎన్నికల జాతర మొదలైంది. పథకాలు ప్రాజెక్టులతో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పీడు పెంచితే.. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు హైదరాబాద్‌ కేంద్రంగా వివిధ కార్యక్రమాలతో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. రాష్ట్రానికి ఢిల్లీ నేతల రాకతో విమర్శలు, ప్రతివిమర్శలు, పోస్టర్ల యుద్ధంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. చారిత్రక దినోత్సవం సందర్భంగా పార్టీలు ఒక్కసారిగా యాక్టివ్‌ అయ్యాయి.

ఎవరి కార్యక్రమాలు వారివే అయినా అందరి లక్ష్యం ఎన్నికలే.. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్పీడు పెంచిన పార్టీలు జనాల దృష్టి ఆకర్షించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. తెలంగాణ కేంద్రంగా ఓట్ల వేటలో పడ్డాయి పార్టీలు. కర్నాటక విజయాన్ని తెలంగాణలో కంటిన్యూ చేయాలని పట్టుదలతో ఉన్న హస్తం పెద్దలు.. వర్కింగ్‌ కమిటీ సమావేశాలు కూడా హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశారు. అగ్రనేతలతో పాటు AICC మొత్తం రెండు రోజులు నగరంలో ఉండి తెలంగాణ కేడర్‌లో జోష్‌ నింపనున్నారు. తెలంగాణ చరిత్రలో అత్యంత ప్రత్యేకత కలిగిన సెప్టెంబర్17న భారీ సభతో ఎన్నికల శంఖారావం మోగించబోతున్నారు పార్టీ పెద్దలు. ఎన్నికలు వరాలు ప్రకటించబోతున్నారు సోనియాగాంధీ. మరోవైపు బీజేపీ కూడా సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే నగరానికి చేరుకుంటున్న అమిత్‌షా రేపు పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగే సభలో ప్రసంగించబోతున్నారు. అటు నగరంలో సరికొత్త పోస్టర్‌ యుద్ధం కూడా మొదలైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ పోస్టర్లు వెలిశాయి. దీనికి పోటీగా అటు బీఆర్ఎస్‌ను ఉద్దేశించి కూడా కాంగ్రెస్ నేతలు పోస్టర్లు వేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Published on: Sep 16, 2023 07:00 PM