Nara Brahmani: సోషల్ మీడియాలో నారా బ్రాహ్మణి ఆసక్తికర పోస్ట్.. వీడియో వైరల్.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సైతం పార్టీలకు అతీతంగా బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఓ చిన్నారి బ్రాహ్మణి వద్దకు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలకడం విశేషం.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. పొరుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు సైతం పార్టీలకు అతీతంగా బాబు అరెస్ట్‌ను ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో షేర్ చేశారు. ఓ చిన్నారి బ్రాహ్మణి వద్దకు వచ్చి చంద్రబాబుకు మద్దతు పలకడం విశేషం. తన చిట్టిపొట్టి మాటలతో చంద్రబాబు జై అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు విడుదలయ్యే వరకు తాను కూడా పోరాడతానని ఆ బాలుడు చెప్పడం నారా బ్రాహ్మణిని తెగ ఆకట్టుకుంది. గతంలో టీడీపీ హయాంలో చంద్రన్న పెళ్లికానుక పథకం తీసుకువరావడం తెలిసిందే. ఆ పథకం ద్వారా లబ్ది పొంది పెళ్లి చేసుకున్న ఓ దంపతులకు కుమారుడే సదరు చిన్నారి. అజిత్ కుమార్ అనే ఆ బాలుడు తనను కలవడం పట్ల బ్రాహ్మణి స్పందించారు. చంద్రబాబు, లోకేశ్‌లకు మద్దతు పలికేందుకు ఆ పిల్లవాడు చాలా దూరం నుంచి వచ్చాడు. ఆ చిన్నారి అభిమానం నచ్చింది. ఆ అబ్బాయి తల్లిదండ్రులు చంద్రన్న పెళ్లికానుక పథకం ద్వారా ఒక్కటయ్యారు అంటూ బ్రహ్మణి వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..