Bandi Sanjay: ఆ కాంగ్రెస్ నాయకులను సీఎం కేసీఆరే పెంచి పోషిస్తున్నారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు బండి. ' కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ పోషిస్తున్నారు. 30 మందికి ప్రతినెలా పాకెట్ మనీ ఇస్తున్నారు. డిపాజిట్లు ఎవరికి పోతున్నాయో అందరికీ తెలుసు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను సీఎం కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు బండి. ‘ కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్ పోషిస్తున్నారు. 30 మందికి ప్రతినెలా పాకెట్ మనీ ఇస్తున్నారు. డిపాజిట్లు ఎవరికి పోతున్నాయో అందరికీ తెలుసు. అవినీతి, కుటుంబ పాలనపై కేంద్రం నిఘా ఉంది. బీజేపీ విజయం సాధించొద్దని కేసీఆర్ భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ లోకి వస్తారని కేసీఆర్‌కు తెలుసు’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు సంజయ్. కాగా గత కొద్ది రోజులుగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకటేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలు హస్తం పార్టీలో చేరనున్నారు. అలాగే వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్‌లో చేరవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి చేరికలు, విమర్శలు, సవాళ్లతో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..