అయ్యో ఎంత కష్టం.. పుట్టినరోజు జరుపుకుని మరుసటి రోజే మృతి చెందిన ఆర్మీ జవాన్..!
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన బానోతు అనిల్ ఆర్మీ జవాన్‌గా కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం తోటి జవాన్లతో పెట్రోలింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అనిల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సూర్య తండాలో విషాదం నెలకొంది. తండాకు చెందిన బానోతు అనిల్ ఆర్మీ జవాన్‌గా కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం తోటి జవాన్లతో పెట్రోలింగ్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అనిల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ మేరకు ఆర్మీ అధికారులు అనిల్ సోదరుడికి సమాచారం ఇచ్చారు. తమ సోదరుడు మరణంతో ప్రసాద్ స్పృహ తప్పి పడిపోయాడు అతన్ని అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనిల్ మరణ వార్తను కుటుంబంలో తల్లికి భార్యకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు..
ఆదివారం(ఆగస్టు 10) రోజున అనిల్, తన పుట్టినరోజుసందర్భంగా తోటి జవాన్లతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నాడు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి, తన భార్య, 7 నెలల బాబుతో సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ ఆనందాన్ని పంచుకున్న మరునాడే ఆర్మీ వాహనం లోయలో పడి అనిల్ మృతి చెందడంతో తీవ్ర విషాదాన్ని నింపింద. ఈ విషయాన్ని తెలుసుకున్న తన కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు కన్నీరు మునీరుగా విలపిస్తున్నారు. సూర్య తండా గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అనిల్ మృతి వారి కుటుంబానికే కాదుస్నేహితులకు, గ్రామానికి కూడా తీరని లోటని స్థానికులు అంటున్నారు. అనిల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని అనిల్ స్నేహితులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
