AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: తండ్రి కోసం ఐఏఎస్ కావాలనుకుంది.. అనారోగ్యంతో రూటు మార్చి ఏకకాలంలో ఆరు ఉద్యోగాలకు ఎంపికైన అక్షిత

గత ఆగస్టులో గురుకుల నోటిఫికేషన్ రాగానే రాజీనామా చేసిన అక్షిత అర్హత పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు. గురుకుల ఎగ్జామ్స్ లో టీపీటీ, పీజీటీకి ఎంపికయ్యారు. జెఎల్ అర్హత పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్, డిఎల్ అర్హత పరీక్షలో 8వ ర్యాంకు సాధించారు. నార్మల్ జెఎల్ అర్హత పరీక్షలో స్టేట్ 4వ ర్యాంకు సాధించారు. డిగ్రీ తరువాత ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచుకున్న అక్షిత.. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు చాలా రకాలుగా శ్రమించారు.

Success Story: తండ్రి కోసం ఐఏఎస్ కావాలనుకుంది.. అనారోగ్యంతో రూటు మార్చి ఏకకాలంలో ఆరు ఉద్యోగాలకు ఎంపికైన అక్షిత
Akshita From Karimnagar
G Sampath Kumar
| Edited By: Surya Kala|

Updated on: Aug 04, 2024 | 10:25 AM

Share

అక్షిత.. అక్షరాలనే ఆలంబనగా చేసుకుని.. అన్వేషణే లక్ష్యంగా పెట్టుకుని పయనం సాగించారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టిన ఆమె తండ్రి కలలను సాకారం చేసే ప్రయత్నంలో అనారోగ్యం పాలయ్యారు. దీంతో సివిల్ సర్వీసెస్ కోసం చేసిన ప్రయత్నానికి బ్రేకు పడింది. అయినా పట్టు వీడకుండా ముందుకు సాగి సరికొత్త రికార్డును అందుకున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేట గ్రామానికి చెందిన అక్షిత సాగించిన ప్రయాణం గురించి నేటి తరం తెలుసుకోవల్సిన అవసరం ఉంది.

అక్షితను ఐఏఎస్ అధికారిగా చూడాలని అనుకున్నాడు ఆమె తండ్రి కిషన్ రెడ్డి. తండ్రి నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించిన ఆమెకు అరోగ్యం సహకరించకపోవడంతో టార్గెట్ ను డైవర్ట్ చేసుకున్నా గురి మాత్రం తప్పలేదు. ఏక కాలంలో ఆరు ఉద్యోగాలకు అర్హత సాధించారు. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గత ఆగస్టులో గురుకుల నోటిఫికేషన్ రాగానే రాజీనామా చేసిన అక్షిత అర్హత పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు. గురుకుల ఎగ్జామ్స్ లో టీపీటీ, పీజీటీకి ఎంపికయ్యారు. జెఎల్ అర్హత పరీక్షలో రాష్ట్రంలో ఐదో ర్యాంక్, డిఎల్ అర్హత పరీక్షలో 8వ ర్యాంకు సాధించారు. నార్మల్ జెఎల్ అర్హత పరీక్షలో స్టేట్ 4వ ర్యాంకు సాధించారు.

డిగ్రీ తరువాత ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచుకున్న అక్షిత.. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు చాలా రకాలుగా శ్రమించారు. పుస్తకాలే కాకుండా తనకు అవసరమైన అంశంపై పరిపూర్ణమైన అవగాన సాధించేందుకు సోషల్ మీడియాను కూడా ఆశ్రయించారు. రీల్స్, ట్రోల్స్ తోనే తాము సక్సెస్ అవుతామని భ్రమల్లో బ్రతుకున్న నేటి తరం యువతకు అక్షిత చేసిన ప్రయత్నం ఆదర్శంగా నిలుస్తోంది. సోషల్ మీడియా వేదికల ద్వారా అవసరమై అంశాలపై పట్టు బిగించే అవకాశం కూడా ఉంటుందని చేతల్లో చూపించారు అక్షిత. చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన అక్షిత ఏక కాలంలో ఆరు ఉద్యోగాలకు ఎంపిక కావడం అంటే అషామాషీ కాదు. నేటి యువత ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని భవితను ఎంచుకోవల్సిన అవసరం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..