AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Waterfalls: తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.!

Telangana Waterfalls: తెలంగాణలో ఈ జలపాతాలు అస్సలు మిస్ అవ్వద్దు.!

Anil kumar poka
|

Updated on: Aug 04, 2024 | 2:02 PM

Share

జలపాతం.. ప్రకృతి అందాల్లో జలపాతాలు ఒకటి. మిగతా సమయం లో ఎలా ఉన్నా వర్షాకాలంలో మాత్రం జలపాతాల అందాలు అద్భుతం. వాటి సోయగాలను కళ్లారా చూడాల్సిందే. తెలంగాణ ప్రాంతాన్ని జలపాతాలకు చిరునామాగా చెప్పవచ్చు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మీదుగా వీటి ప్రయాణం.. మనల్ని ఆకర్షిస్తాయి. Asifabad జిల్లాలోని అటవీప్రాంతాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి.

జలపాతం.. ప్రకృతి అందాల్లో జలపాతాలు ఒకటి. మిగతా సమయం లో ఎలా ఉన్నా వర్షాకాలంలో మాత్రం జలపాతాల అందాలు అద్భుతం. వాటి సోయగాలను కళ్లారా చూడాల్సిందే. తెలంగాణ ప్రాంతాన్ని జలపాతాలకు చిరునామాగా చెప్పవచ్చు. ఎత్తైన కొండలు, దట్టమైన అడవుల మీదుగా వీటి ప్రయాణం.. మనల్ని ఆకర్షిస్తాయి. Asifabad జిల్లాలోని అటవీప్రాంతాల్లో సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి. జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు అటవీ ప్రాంతాల్లో జలపాతాలు జలకళను సంతరించుకోవడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

ప్రకృతి సోయగాల ఆసిఫాబాద్‌ జిల్లా అటవీప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏ మాత్రం ఆదరణ చూపినా తెలంగాణ కశ్మీర్‌గా ఘనతకెక్కిన తూర్పుప్రాంతం పర్యాటక శోభను సంతరించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చుట్టూ ఎత్తైన పచ్చని గుట్టలు… పక్షుల కిలకిలరావాలు.. గలగల పారే సెలయేటి సవ్వళ్లు.. గుట్టల మీది నుంచి కిందికి జాలువారుతున్న సెలయేర్లు.. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా పర్యాటకుల మనసుకు హత్తుకుంటాయి. పర్యాటక ప్రేమికులకు కనబడకుండా అడవి తల్లి ఒడిలో ఎన్నో జలపాతాలు జిల్లాలో విరివిగా ఉన్నాయి. ఈ దృశ్యాలు ఓ అద్భుతం.

ఆసిఫాబాద్‌ మండల కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో సమితుల గుండం జలపాతం ఉంది. లింగాపూర్‌ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్‌ గ్రామాల మధ్య ఉన్న మిట్టే జలపాతం సందర్శకులను కనువిందు చేస్తుంది. సిర్పూర్‌ మండలంలోని ఎత్తైన గుట్టల నుంచి జాలువారే… కుండాయి జలపాతం ప్రకృతి రమణీయతను చాటుకుంటుంది. తిర్యాణి మండలంలోని గుండాల, చింతలమాదర, ఉల్లిపిట్ట గ్రామాల సమీపంలో గుండాల, చింతలమాదర, ఉల్లిపిట్ట జలపాతాలు, వాంకిడి మండలంలోని సర్కెపల్లి గ్రామ సమీపంలోని బుగ్గ జలపాతం ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా కనువిందు చేస్తున్నాయి. కెరమెరి మండలంలో బాబేఝరి, కల్లెగాం గ్రామాల సమీపంలో, పెంచికల్‌ పేట మండలంలోని కొండెంగ లొద్ది జలపాతాలు గుట్టలపై నుంచి జాలువారుతూ పర్యాటకులను ఆకర్షిసున్నాయి.

జిల్లాలో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్న జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఎన్నో జలపాతాలు జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అరకు లోయకు దీటుగా పర్యాటకులను ఆకర్షించే అద్భుతమైన వింతలు, విశేషాలు ఎన్నో ఈ ప్రాంతంలో నిండుగా దాగి వెలుగునకు నోచుకోకుండా ఉన్నాయి. అలాంటి ప్రదేశాలను అభివృద్ధి చేసి ప్రాచుర్యం కల్పిస్తే రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించవచ్చు. ఉపాధి అవకాశాలతో అడవి బిడ్డలకు ఆసరా ఇవ్వచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.