AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wayanad Landslide: వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..

Wayanad Landslide: వయనాడ్‌లో ప్రకృతి విధ్వంసం.! తవ్వకాల్లో హోటళ్లు, రిసార్టులు..

Anil kumar poka
|

Updated on: Aug 04, 2024 | 12:12 PM

Share

అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్‌ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళను ఆనుకుని అరేబియా సముద్రం. ఆ పై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్‌–సెప్టెంబర్‌ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కళ్లు తిప్పుకోనివ్వవు.

అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్‌ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళను ఆనుకుని అరేబియా సముద్రం. ఆ పై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్‌–సెప్టెంబర్‌ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కళ్లు తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఎక్కువగా పెరుగుతోంది.

దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్‌ చెబుతోంది.

వయనాడ్‌ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్‌ ఇంపీరియల్‌ కాలేజ్‌ రీసెర్చ్‌ అసోసియేట్‌ మరియం జకారియా అన్నారు. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించిందనీ దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్‌ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయిందని చెప్పారు. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని అన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.