FASTAG New Rules: ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు.! ఫాస్టాగ్‌ యూజర్లు కేవైసీ..

FASTAG New Rules: ఆగస్టు 1 నుంచి అమల్లోకి ఫాస్టాగ్‌ కొత్త నిబంధనలు.! ఫాస్టాగ్‌ యూజర్లు కేవైసీ..

Anil kumar poka

|

Updated on: Aug 04, 2024 | 1:01 PM

ఫాస్టాగ్‌కు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్‌ లిస్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయాల్లో ప్రతి వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫాస్టాగ్‌కి రూల్స్‌లో వచ్చిన అతి పెద్ద ఛేంజ్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్‌ను అప్‌డేట్ చేయడం.

ఫాస్టాగ్‌కు సంబంధించి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. దీని కోసం ప్రజలు తమ ఫాస్టాగ్ ఖాతాలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారికి టోల్ ప్లాజా వద్ద కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫాస్టాగ్ బ్లాక్‌ లిస్ట్ అవుతుంది కాబట్టి ఈ విషయాల్లో ప్రతి వారు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఫాస్టాగ్‌కి రూల్స్‌లో వచ్చిన అతి పెద్ద ఛేంజ్ ఏంటంటే కేవైసీ ప్రాసెస్‌ను అప్‌డేట్ చేయడం. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త నిబంధన ప్రకారం ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం నుంచి వాడుతున్న ఫాస్టాగ్ ఖాతాలను మార్చాలి. దీని కోసం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖాతా ఇన్సూరెన్స్ తేదీని చెక్ చేయాలి. అవసరమైతే దాన్ని మార్చుకోవాలి.

అదే సమయంలో మూడు సంవత్సరాల వయసున్న ఫాస్టాగ్ ఖాతాలకు కేవైసీని మళ్లీ అప్‌డేట్ చేయాలి. ఫాస్టాగ్ సేవ కోసం కేవైసీని పూర్తి చేయడానికి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంది. యూజర్లు, కంపెనీలు తమ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ అప్‌డేషన్ ప్రక్రియను అక్టోబర్ 31వ తేదీ నాటికి పూర్తి చేయవచ్చు. అయితే మీ ఫాస్టాగ్ ఖాతా కేవైసీ ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నాటికి ఒక్కసారి కూడా పూర్తి కాకపోతే అది వెంటనే బ్లాక్ లిస్ట్ అవుతుంది.

ఫాస్టాగ్ నిబంధన లలో మరో మార్పు ఏమిటంటే.. మీ ఫాస్టాగ్ ఖాతా మీ వాహనం, వాహన యజమాని ఫోన్ నెంబర్‌కు లింక్ చేయాలి. ఏప్రిల్ నుంచి ఒక్క వాహనానికి మాత్రమే ఫాస్టాగ్ ఖాతాను వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీనితో పాటు వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌కు బ్యాంక్‌ అకౌంట్‌ ను లింక్ చేయడం కూడా అవసరం. ఇందుకోసం వాహనం ముందు, పక్క ఫొటోలను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 1న లేదా ఆ తర్వాత కొత్త వాహనం కొనుగోలు చేసే వారు వాహనం కొనుగోలు చేసిన మూడు నెలల్లోగా తమ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.