TOP9 ET: కల్కి సినిమా కలెక్షన్స్ పై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్ | రాజ్ గురించి లావణ్య సంచలన ఆరోపణ
ఎపిక్ మైథలాజికల్ .. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కల్కి మూవీ.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది. 12వందల కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టేసింది. అయితే ఈ కలెక్షన్స్‌పైనే తాజాగా బన్నీ వాసు ఓ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కల్కి లాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాకు.. సుమార్ 2వేల కోట్ల కలెక్షన్స్ వస్తాయని బన్నీ వాసు అనుకున్నారట.
01.kalki: కల్కి సినిమా కలెక్షన్స్ పై బన్నీ వాసు షాకింగ్ కామెంట్స్.!
ఎపిక్ మైథలాజికల్ .. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కల్కి మూవీ.. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టైంది. 12వందల కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టేసింది. అయితే ఈ కలెక్షన్స్‌పైనే తాజాగా బన్నీ వాసు ఓ కామెంట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. కల్కి లాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాకు … సుమార్ 2వేల కోట్ల కలెక్షన్స్ వస్తాయని బన్నీ వాసు అనుకున్నారట. కానీ ఆ రేంజ్ కలెక్షన్స్ రాకపోయే సరికి ఆయన బాధపడ్డారట. ఆ క్రమంలోనే ఇటీవల కల్కి కలెక్షన్స్ పై ఓ కామెంట్ చేశారు. అది కాస్తా కాంట్రో అవడంతో.. రీసెంట్గా.. క్లారిటీ ఇస్తూ.. ఈ కామెంట్స్ చేశారు బన్నీ వాసు..
02.lavanya: ఆరియానను ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేపించాడు రాజ్ గురించి లావణ్య సంచలన ఆరోపణ.
లావణ్య ఆరోపణలతో.. ఇప్పుడు ఆరియానా చిక్కుల్లో పడేలానే ఉంది. తాను మాత్రమే కాదు.. ఆరియానా కూడా.. రాజ్ తరుణ్ బాధితురాలని లావణ్య మరో సారి ఆరోపణలు చేయడం నెట్టింట సంచలనంగా మారింది. తన లాగే ఆరియానను కూడా.. రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేసి అబార్షన్ చేయించాడని తాజాగా ఈమె మరో సారి ఆరోపణలు చేసింది.
02.samntha: ఈవెంట్లో ఇబ్బంది పడ్డ సమంత పాపం! ఇంకా నయం కాలేదా.?
నిన్న మొన్నటి వరకు తన హెల్త్ మిషన్‌తో బిజీగా ఉన్న సామ్.. ఇప్పుడు మళ్లీ తన సినిమా లైఫ్లోకి వచ్చేశారు. ఓ పక్క తన ప్రొడక్షన్స్‌లోనే ఓ సినిమా చేస్తూనే.. తాను చేసిన యాక్షన్ రొమాంటిక్ సిరీస్.. సిటాడెల్ ప్రమోషన్లోనూ పాల్గొంటున్నారు. ఇక ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఈ సిరీస్ టీజర్ లాంచ్ ఈవెంట్లో…హంగామా చేశారు. కానీ ఎందుకనో కాస్త ఇబ్బంది పడినట్టు అనిపించారు. కొనితెచ్చుకున్న నవ్వు.. ముఖంలో ఇబ్బంది.. కళ్లలో నీళ్లతో .. కాస్త నీరసంగా కనిపించారు. అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవడంతో.. సమంతకు ఇంకా నయం అవలేదా ఏంటి? అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
03. mohan lal: వయనాడ్ బాధితులకు స్టార్ హీరో 3 కోట్ల విరాళం.
మల్లూవుడ్ స్టార్ మోహన్ లాల్.. తన గొప్ప మనసు చాటుకున్నాడు. వయనాడ్ వరద బాధితులకు ఏకంగా 3 కోట్ల విరాళం అందించారు. మిలిటరీ అధికారి హోదాలో.. వయానాడ్ వరద ప్రాంతాల్లో పర్యటించిన ఈ హీరో.. సైనికులతో కలిసి వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాధితులతో మాట్లాడి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇక టాలీవుడ్ హీరోయిన్ రష్మిక కూడా.. వయనాడ్ వరద బాధితుల కోసం 10 లక్షలు ఇచ్చారు. కేరళ సీఎం సహాయ నిధికి ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు.
04.vijay: తనకిష్టమైన 2 కోట్ల కార్‌ను అమ్మకానికి పెట్టిన స్టార్ హీరో.!
లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టపడే విజయ్ దళపతి.. తను ఇష్టపడి కొనుకున్న రోల్స్ రాయిస్ కార్‌ను అమ్మకానికి పెట్టారు. తన నిర్ణయంతో అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇక 2012లో ఎంతో ముచ్చటపడి మరీ.. ఈ రోల్స్ రాయిస్ కార్‌ను విదేశాల నుంచి తెప్పించుకున్నారు విజయ్. ఈక్రమంలోనే లీగల్ ట్రబుల్స్‌ను ఎదుర్కొన్నారు. ఓ దశలో జనాల నోట్లలో హాట్ టాపిక్ అయ్యారు నెగెటివ్ కామెంట్స్ వచ్చేలా చేసుకున్నాడు. అలాంటి ఈ కార్‌ను .. ఇప్పుడు అమ్మకానికి పెట్టాడు .
05.lavanya: అటుపోయి ఇటుపోయి.. లావణ్య మెడకే ఉచ్చు?
రాజ్ తరుణ్ – లావణ్య మధ్య ఇష్యూ మరో టర్న్ తీసుకుంది. అటు పోయి ఇటు పోయి ఈ వివాదం లావణ్య మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. తాజాగా లావణ్యే తమకు డ్రగ్ అలవాటు చేసిందని ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరూ పోలీస్ మెట్లక్కడం ఇప్పుడు సంచలనంగా మారింది.
06. thaman: ‘OG’, రాజా సాబ్ అప్డేట్స్ ఇచ్చిన థమన్
మ్యూజిక్, క్రికెట్ ఈ రెండు పనులతోనే ఎప్పుడూ బిజీగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఈ మధ్య ఇండియన్ ఐడల్ తెలుగు షోలోనూ జడ్జిగా అదరగొడుతున్నారు. పంచులు.. ప్రాసలో కామెంట్స్ ఇస్తూ.. తన మాటలతో నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక ఈక్రమంలోనే ఎక్స్ హ్యాండిల్లో తన ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చట్టించిన థమన్.. పవర్ స్టార్ పనవ్ కళ్యాణ్ ఓజీ, రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమా సాంగ్స్ రిలీజ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. తొందర్లో ఓజీ నుంచి సాంగ్ అప్డేట్ వస్తుందంటూ చెప్పారు. దీనికోసం డైరెక్టర్ సుజీత్ వర్క్ చేస్తున్నట్లు హింట్ ఇచ్చారు. ఇక రాజాసాబ్ సినిమా ఫస్ట్ సింగిల్ జనవరిలో ఉండొంచ్చంటూ చెప్పారు.
07.mister buchan: హీరోయిన్ అందంగా కాదు.. కాస్త అతిగా కనిపిస్తోంది.!
హీరోయిన్ అందంగా కనిపిస్తే.. ఎవరైనా ఆరాధిస్తారు. కానీ సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్స్ మాత్రం.. ట్రోల్ చేస్తుంటారు. నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఇక తాజాగా టాలీవుడ్ నయా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే విషయంలోనూ ఇదే చేస్తున్నారు. రవితేజాస్ మిస్టర్ బచ్చన్ సినిమాతో.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈబ్యూటీ.. ఇప్పుడు వరుసగా రిలీజ్ అవుతున్న లిరికల్ సాంగ్స్‌లోని తన లుక్స్‌తో నెట్టింట ట్రెండ్ అవుతోంది. తెలుగు టూ స్టేట్స్ న్యూ క్రష్‌గా మారుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన థర్డ్ సింగిల్ జిక్కిలో మాత్రం కాస్త అతిగా పరువాల ప్రదర్శన చేసినట్టు కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. ఓవర్గం నెటిజన్స్ టార్గెట్ అయిపోయింది.
08.krithi shetti: షాకిచ్చిన బేబమ్మ.. మరీ ఇలా అయిపోయింది ఏంటి.?
ఉప్పెన సినిమాతో బేబమ్మగా.. చాలా క్యూట్‌గా.. కుర్రాల్ల గుండెల్లోకి దూసుకుపోయిన కృతి షెట్టి.. ఇప్పుడు తన లుక్స్‌తో అందరికీ దిమ్మతిరిగేలా చేసింది. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో… హీరో ప్రదీప్ రంగనాథ్ తో లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ సినిమా చేస్తోంది. ఇక ఈ సినిమా నుంచి తాజాగా కృతి షెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్‌లో వెస్ట్రన్ గార్ల్‌గా.. పూర్తిగా మారిపోయింది కృతి. మారిపోవడమే కాదు… తన లుక్స్‌తో చూసిన వారిని షాకయ్యేలా చేస్తోంది.
09.anjali: రక్తం మాటున అందం.!
సీతగా.. గడుసు పిల్లగా నిన్న మొన్నటి వరకు మనకు తెలుసిన అంజలి.. ఇప్పుడు గడుసు తనంతోనే కాదు.. బోల్డ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ.. తన యాక్టింగ్ స్కిల్స్‌తో అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. రీసెంట్‌గా తను చేసిన బహిష్కరణ సిరీస్‌లోనూ.. తన చీరకట్టుతో.. అందర్నీ ఆకట్టుకుంది. పుష్ప క్యారెక్టర్లో యాక్ట్ చేసి.. ఆ క్యారెక్టర్ తీరుతో.. ఆ క్యారెక్టర్లో తను ఇమిడిన విధానంతో.. అందర్నీ మెస్మరైజ్ చేస్తోంది. అందులోనూ క్రేజీ కామెంట్స్ ను వచ్చేలా చేసుకుంటోంది ఈ బ్యూటీ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.