AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చాక్లెట్‌ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..

హైదరాబాద్ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యమైంది.. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని కనిపెట్టారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పోలీసులు గుర్తించారు.. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికను అబిడ్స్‌కు తీసుకొచ్చారు.

Hyderabad: చాక్లెట్‌ ఇస్తానని బాలికను కిడ్నాప్ చేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..
Girl Kidnapp
Shaik Madar Saheb
|

Updated on: Aug 04, 2024 | 11:40 AM

Share

హైదరాబాద్ అబిడ్స్‌లో కిడ్నాపైన బాలిక ఆచూకీ లభ్యమైంది.. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల్లోనే బాలిక ఆచూకీని కనిపెట్టారు. బాలికను రంగారెడ్డి జిల్లా కొత్తూరులో పోలీసులు గుర్తించారు.. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలికను అబిడ్స్‌కు తీసుకొచ్చారు.. అంనతరం బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాపర్ కనిపించగానే బాలిక బంధువులు అతడిపై దాడికి దిగారు.

అసలేం జరిగిందంటే..

చాక్లెట్‌ ఇస్తానని చెప్పి అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌‌ పరిధిలో బాలికను కిడ్నాప్ చేశాడు దుండగుడు. కట్టెలమండిలో నానమ్మ ఇంటికి వచ్చిన బాలిక ప్రగతిని ఇంటి ముందు ఆడుకుంటుండగా ఏమార్చాడు దుండగుడు… దూరంలో పార్క్‌ చేసి ఉన్న ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు.

ప్రగతి కనిపించకపోవడంతో బాలిక మేనత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా కేవలం 12 గంటల్లోనే శోధించారు. చివరకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు దగ్గర గుర్తించారు. కిడ్నాపర్‌ను అరెస్టుచేసి వివరాలు సేకరిస్తున్నామని.. పోలీసులు తెలిపారు.

పోలీసులకు కృతజ్ఞతలు చెప్పారు బాలిక బంధువులు. కంప్లైంట్‌ చేసిన వెంటనే స్పందించి… తమ పాపను కాపాడారని థ్యాంక్స్‌ చెప్పారు

కిడ్నాపర్‌ను బిహార్‌కి చెందిన మహహ్మద్‌ బిలాల్‌గా గుర్తించారు పోలీసులు. ఇతనికి గతంలోనే నేర చరిత్ర ఉందని.. పిల్లలను కిడ్నాప్‌చేసి బిహార్‌లో విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. దాంతో, కిడ్నాపర్‌ వెనుక ముఠా ఏదైనా ఉందా? ఇప్పటివరకు ఎంతమందిని కిడ్నాప్‌ చేశాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!