AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం.. ఏంటి 8 నెలల్లో ఇంత మంది అరెస్టా?

తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే అవినీతి నిరోధక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ లంచగొండ్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఈక్రమంలోనే గత ఎనిమిది నెలలో ఏసీబీ సుమారు అవినీతి ఆరోపణల కేసులో 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది.

Telangana: అవినీతి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం.. ఏంటి 8 నెలల్లో ఇంత మంది అరెస్టా?
Tg Acb
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Sep 01, 2025 | 3:14 PM

Share

తెలంగాణలో అవినీతిని అరికట్టడంలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఎనిమిది నెలల్లోనే ఏసీబీ మొత్తం 179 కేసులు నమోదు చేసి, ప్రభుత్వ లంచగొండ్లపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు లంచం తీసుకున్న 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. అందులోనూ 108 మందిని స్వయంగా లంచం తీసుకుంటున్నప్పుడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం విశేషం. ఈ ఆపరేషన్లలో ఏసీబీ అధికారులు 33.12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదే కాకుండా లంచాలు తీసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాధించిన వారికి కూడా ఏసీబీ చెక్‌ పెట్టింది. ఈ కేసుల్లో కూడా ఏసీబీ గట్టి చర్యలు తీసుకుంది. గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలో ఈ కేసుల్లో మొత్తం 11 మంది అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది, వారి వద్ద ఉన్న రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా, అవినీతికి పాల్పడిన ప్రైవేట్ ఉద్యోగులను సైతం ఏసీబీ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపుతుంది. ఇదిలా ఉండగా కేవలం గత ఆగస్టు నెలలోనే 31 మంది అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే రోజురోజుకూ రాష్ట్రంలో అవినీతి అధికారులు పెరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి తాలూకు కేసుల్లో ఎవరూ తప్పించుకోలేరని. లంచం తీసుకుంటే ఎవరూ పట్టుబడిని వారిని ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ మీరు లంచం తీసుకుంటున్నట్టయితే ఎప్పటికైనా తమను వదిలేది లేదని ఏసీబీ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
మాజీ ఆర్మీ జవాన్.. తాగుడు అతడ్ని ఇంతలా దిగజార్చింది..
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
అందుకే జీవన్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడారు..మల్లు రవి కీలక వ్యాఖ్యలు
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
టేస్ట్.. డబుల్ ఎనర్జీ.. ఎవ్వరికీ తెలియని రాగి లడ్డు రెసిపీ ఇదే..
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
పిల్లలకు ఇస్తున్న క్రీమ్ బిస్కెట్లలో అసలు క్రీమ్ ఉందా?
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
రంగు పోయిన రోల్డ్ గోల్డ్ నగలకు ఇంట్లోనే మెరుగు
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే బల్లులకు చుక్కలే.. ఇలా చేస్తే ఒక్కటి కూడా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం సూపర్ న్యూస్.. దేశంలో ఎక్కడైనా..
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
ఐపీఎల్ లో వైభవ్ సూర్యవంశీ సంచలన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. పరీక్షలైన వెంటనే టెన్త్ రిజల్ట్
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు..