Hyderabad: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఈ వారంలో వరుసగా 3 రోజులు సెలవులు
ఈ వారంలో పాఠశాలలు, కాలేజీలకు… శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హాలిడేస్ రానున్నాయి. సెప్టెంబర్ 5 అంటే శుక్రవారం రోజున మిలాద్ ఉన్ నబి పండుగ ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించింది. శనివారం గణేశ్ నిమజ్జనాలు ఉన్నాయి. దీంతో నగరంలోని పాఠశాలలకు ఆ రోజు కూడా సెలవు ఉండనుంది.

విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ వారంలో వరుస సెలవులు రానున్నాయి. బ్యాక్ టూ బ్యాక్ 3 రోజులు సెలవలు వస్తుండటంతో… స్టూడెంట్స్ మస్త్ హ్యపీ ఫీల్ అవతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సెప్టెంబర్ 5 శుక్రవారం రోజున మిలాద్-ఉన్-నబీ మహ్మద్ ప్రవక్త జయంతి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ సెలవు ప్రకటించింది. ఇక హైదరాబాద్ నగరంలో సెప్టెంబర్ 6న శనివారం వినాయక నిమజ్జనాలు ఉన్నాయి. దీంతో ఆ రోజు కూడా సెలవే. నెక్ట్స్ డే ఆదివారం.. జనరల్ హాలిడే. ఇలా వరసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. కేవలం స్టూడెంట్స్‌కు మాత్రమే కాదు.. ఐటీ ఉద్యోగులకు కూడా ఈసారి 3 రోజులు హాలిడేస్ రావడం వల్ల ఎంచక్కా ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు.
హైదరాబాద్‌లో కొనసాగుతున్న నిమజ్జనాల ప్రక్రియ..
వేలాదిగా గణపయ్య విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు తరలుతున్నాయి. ట్యాంక్‌బండ్‌పై గణేష్ నిమజ్జనం కోలాహలంగా సాగుతోంది. వెళ్లి రావయ్యా బొజ్జ గణపయ్యా, మళ్లీ రావయ్యా బొజ్జ గణపయ్యా అంటూ పిల్లలు డ్యాన్సులు చేస్తూ…గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఈసారి నిమజ్జనం వేడుకల్లో పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్‌పై ప్రత్యేక కొలను ఏర్పాటు చేసింది GHMC. ఇక ఎన్టీఆర్ మార్గ్ పీపుల్స్ ప్లాజా దగ్గర కూడా సందడి వాతావరణం నెలకొంది. చిన్న గణపతి విగ్రహాల నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం మొదలైన గణేష్ నిమజ్జనాలు రాత్రి కూడా కొనసాగాయి. ఇక ఖైరతాబాద్‌లో కొలువుతీరిన బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కిలోమీటర్ల మేర బారులు తీరారు. శ్రీవిశ్వశాంతి మహాగణపతిగా కొలువుదీరిన గణేశుడి దర్శనం కోసం హైదరాబాద్ నుంచే కాదు, మిగతా ప్రాంతాల నుంచి సైతం భక్తులు వస్తున్నారు. 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో శాంతమూర్తిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిశక్తి సమేతుడిగా కొలువు దీరాడు ఖైరతాబాద్ గణేశుడు. ఇవాళ 3 లక్షలమంది భక్తులు బడా గణేష్‌ని దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు. ఇక హైదరాబాద్ రాంనగర్ TRT కాలనీలో అమర్నాథ్ మంచులింగం సెట్టింగ్ తో భారీ వినాయక మండపం నిర్మించారు. మంచులింగంతో పాటు 12 జ్యోతిర్లింగాలతో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ.. మండపాన్ని సందర్శించి గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




