మరో పతిదేవుడు బలి.. కళ్లల్లో కారం చల్లి, మెడకు చీర బిగించి చంపిన భార్య! ఎందుకంటే..
ఇటీవల కాలంలో భర్తలను సొంత భార్యలే కడతేర్చుతున్న ఉదంతాలు లెక్కకుమించి జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో హనీమూన్ ఉదంతంతో మొదలైన ఈ పరంపర.. దేశ వ్యాప్తంగా వరుస పెట్టి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోమారు వికారాబాద్ జిల్లా, మోమిన్ పెట్ మండలం కేసారంలోనూ మరో దారుణం వెలుగులోకి వచ్చింది..

వికారాబాద్, సెప్టెంబర్ 1: ఒకప్పుడు పతి దేవుడి నూరేళ్ల ఆయుష్షు కోసం కటిక ఉపవాసం ఉండి పూజలు.. నోములు.. చేసే భార్యామణులు మన దేశంలో ఉండేవారు. కానీ నేటి కాలంలో రోజుకో చోట చిత్రవిచిత్ర రీతిలో సొంత భార్యలే.. భర్తలను మర్డర్లు చేస్తున్నారు. కొన్ని ప్రేమ బంధాల కోసం జరిగితే.. మరికొన్ని చోట్ల కట్టుకున్నోడి వేదింపులు భరించలేక ఏకంగా భర్తలను చంపి చేతులు దులుపుకుంటున్నారు భార్యలు. ఇటీవల కాలంలో భర్తలను సొంత భార్యలే కడతేర్చుతున్న ఉదంతాలు లెక్కకుమించి జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో హనీమూన్ ఉదంతంతో మొదలైన ఈ పరంపర.. దేశ వ్యాప్తంగా వరుస పెట్టి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోమారు వికారాబాద్ జిల్లా, మోమిన్ పెట్ మండలం కేసారంలోనూ మరో దారుణం వెలుగులోకి వచ్చింది.
వికారాబాద్ జిల్లా మోమిన్ పెట్ మండలం కేసారంలో కుమార్, రేణుక అనే జంట ఓ వెంచర్‌లో కాపురం ఉంటున్నారు. అయితే మద్యంకి బానిసైన కుమార్ తరచూ భార్యను వేదించేవాడు. భర్త వేధింపులు భరించలేక అతడిని మట్టుబెట్టాలని రేణుక భావించింది. ఈ క్రమంలో తాజాగా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త మరోమారు భార్య రేణుకపై దాడి చేశాడు. దీంతో సహనం నశించిన భార్య రేణుక.. భర్త కండ్లలో కారం చల్లింది. ఆనక మెడకు చీర బిగించి భర్తను హత్య చేసింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంకి చేరుకుని మృతదేహాన్ని అదుులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తప్పూ చేశానని రేణుక కన్నీరుమున్నీరుగా విలపింపసాగింది. ఏం చేయాలో తెలియక చంపేశా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని మెమిన్ సీఐ వెంకట్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








