Telangana: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌.. 20 మంది విద్యార్ధినులకు అశ్వస్థత

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్ధులను సమీపంలోని మండల ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అశ్వస్థతకు గురైన విద్యార్ధుల్లో ఐదుగురిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంఘ్వాన్‌, మండల విద్యాధికారి హాస్పిటల్‌కు చేరుకుని..

Telangana: కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌.. 20 మంది విద్యార్ధినులకు అశ్వస్థత
Food Poision
Follow us

|

Updated on: Apr 04, 2024 | 4:19 PM

నిర్మల్‌, ఏప్రిల్ 4: రాష్ట్రంలోని నిర్మల్‌ జిల్లాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలిక విద్యాలయలో ఫుడ్ పాయిజన్‌ అయ్యింది. దీంతో 20 మంది విద్యార్ధులు తీవ్రంగా అశ్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన బుధవారం (ఏప్రిల్ 3) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌ మండలంలోని కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌ తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పాఠశాల సిబ్బంది విద్యార్ధులను సమీపంలోని మండల ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. అశ్వస్థతకు గురైన విద్యార్ధుల్లో ఐదుగురిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంఘ్వాన్‌, మండల విద్యాధికారి హాస్పిటల్‌కు చేరుకుని విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్యం గురించి వైద్యులను ప్రశ్నించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ప్రస్తుతం విద్యార్ధినులకు ప్రాణాపాయం లేదని, వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. విద్యార్ధినుల అశ్వస్థతపై విచారణ చేపడతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరో ఘటన: హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టివేత

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీగా నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహనాలను చెక్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దాదాపు రూ.25 లక్షల నకిలీ నోట్లను మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ నకిలీ నోట్లను మహారాష్ట్ర నుంచి తెలంగాణకు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మీడియాకు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!