AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR: వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. కారణమిదే

వరంగల్ లోకసభ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో బిఆర్ఎస్ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించక ముందే పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య మంచి అభ్యర్థిగా కనిపించారు. అయితే డాక్టర్ కడియం కావ్యను వరంగల్ కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే ముందు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.

KCR: వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపై కేసీఆర్ వ్యూహాత్మక అడుగులు.. కారణమిదే
KCR (File)
Balu Jajala
|

Updated on: Apr 04, 2024 | 4:16 PM

Share

వరంగల్ లోకసభ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో బిఆర్ఎస్ విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించక ముందే పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య మంచి అభ్యర్థిగా కనిపించారు. అయితే డాక్టర్ కడియం కావ్యను వరంగల్ కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించే ముందు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అభ్యర్థులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. పార్టీ నిర్ణయంతో మనస్తాపం చెందిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు.

అయితే, కేసీఆర్ కడియం కావ్యా పేరును డిక్లేర్ చేయగా ఆమె అనూహ్యంగా టికెట్ నిరాకరించడమే కాకుండా తన తండ్రి, సీనియర్ నేత కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ వరంగల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ నిర్ణయిస్తే వరంగల్ నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నలను పార్టీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.

ఇక ప్రభుత్వ ఉద్యోగి అయిన పుల్లా శ్రీను వరంగల్ టికెట్ ను బీఆర్ఎస్ నుంచి దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య తనకు వరంగల్ టికెట్ ఇస్తే తిరిగి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. రాజయ్య బీఆర్ఎస్ నాయకత్వంతో బ్యాక్ రూమ్ చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. అయితే డాక్టర్ కావ్య షాక్ తర్వాత కేసీఆర్ అభ్యర్థిని ప్రకటించే ముందు అన్ని ఆప్షన్లను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.