Telangana: డబుల్ రోల్ ప్లే చేస్తున్న సీఎం రేవంత్.. ఎన్నికల్లో పూర్తి ఫోకస్ దానిపైనే..
పార్లమెంట్ ఎన్నికల వేళ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ప్రభుత్వ వ్యహరాలతో పాటుగా పార్టీ వ్యహరాల్లోను బిజి బిజిగా గడుపుతున్నారు. నోటిపికేషన్ విడుదలయినప్పటి నుండి ఇంటి నుండే తన పని కానిచ్చేస్తున్న సీఎం, పాలన వ్యవహరాల్లోను తన పట్టును కోల్పోకుండా సమీక్ష చేస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ప్రభుత్వ వ్యహరాలతో పాటుగా పార్టీ వ్యహరాల్లోను బిజి బిజిగా గడుపుతున్నారు. నోటిపికేషన్ విడుదలయినప్పటి నుండి ఇంటి నుండే తన పని కానిచ్చేస్తున్న సీఎం, పాలన వ్యవహరాల్లోను తన పట్టును కోల్పోకుండా సమీక్ష చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సచివాలయానికి రాకుండా ఇంటి నుండే పరిపాలన చూస్తున్నారు. రోజు వారిగా అధికారుల నుండి సమాచారం తీసుకోవడంతో పాటుగా వచ్చే వేసవి కోసం నీటి ఏద్దడి లేకుండా చూడటం, తాగు నీటి సరాఫరా వంటి అంశాలను ఇంటి నుండే పర్యవేక్షిస్తున్నారు.
పార్టీ వ్యవహరాలు అన్ని ఇంటి నుండే..
ఇక జూబ్లిహిల్స్‌లోని తన నివాసం కేంద్రంగానే మొత్తం పార్టీ వ్యహరాలను చూస్తున్నారు సిఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేయడంతో పాటుగా పార్టీ చేరికలు, సమీక్ష సమావేశాలు కూడ ఇక్కడి నుండే నడిపిస్తున్నారు. గాంధీ భవన్‌కు కూడా అడపాదడపా వేళ్తున్న సీఎం రేవంత్ మొత్తం వ్యవహరాన్ని ఇంటి నుండే సాగిస్తున్నారు. ఇక ఎంపిల నుండి మండల స్థాయి నేతల వరకు అన్ని సమావేశాలు ఇంటి నుండే నిర్వహిస్తున్నారు. ఇక అటు తుక్కుగూడలో కాంగ్రెస్ ఈ 6 తేదిన చేపట్టే సభకు సంబంధించిన అంశాలు కూడ ఇంటి నుండే పర్యవేక్షిస్తున్నారు.
డబుల్ రోల్ -12 సీట్లు టార్గెట్..
పీసిసి అధ్యక్షుడిగా, సీఎంగా ఉన్న రేవంత్ రెండు బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తున్నారు. పీసిసి అధ్యక్షునిగా 12 లోక్ సభ సీట్లు గెలిచే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. దీని కోసం పార్లమెంట్ వారీగా నాయకులతో, క్యాడర్ తో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పట్టు సాధించి కాంగ్రెస్ అధిష్టానానికి తన మెరిట్ ఏంటో చూపించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి