AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

పార్టీ ఫిరాయింపులు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. తెలంగాణలో ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాయకులను కలవరపెడుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy
Srikar T
|

Updated on: Apr 04, 2024 | 6:00 PM

Share

పార్టీ ఫిరాయింపులు, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. తెలంగాణలో ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నాయకులను కలవరపెడుతోంది. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ప్రజాస్వామ్యం, వ్యక్తిగత స్వేచ్ఛను అప్పటి BRS ప్రభుత్వం హరించివేసిందని ఆయన ఆరోపించారు. ట్యాపింగ్‌ వ్యవహారం అషామాషీ కేసు కాదని.. ఇది కక్ష సాధింపు చర్య అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విపక్షాల ఫోన్లు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లను ట్యాప్‌ చేశారని వెల్లడించారు. ఇందులో కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల పాత్రపై ఉన్నతస్థాయి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఈసీ కూడా దీన్ని సుమోటోగా స్వీకరించి, బీఆర్‌ఎస్‌ గుర్తుపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు కిషన్‌రెడ్డి. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిందన్నారు. గతంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ నియమాలను ఉల్లంఘించిందన్నారు. ప్రతిపక్ష నేతలకు చెందిన ఫోన్లను ఇష్టాను సారంగా ఫోన్ ట్యాంపింగ్ చేశారని ఆరోపించారు.

ఈ వ్యవహారాలను కారణం ఎవరని.. నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నానన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను సైతం ట్యాంపింగ్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఇప్పుడు విచారణలో బయటపడుతోందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయన్నారు. దేశ భద్రత, సమగ్రతకు ముడిపడిన అంశమన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి లిఖిత పూర్వకమైన అనుమతి తీసుకునే ట్యాప్ చేయాలని చెప్పారు. నేషనల్ ఇంటిగ్రిటికు సంబంధించి ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు అందజేసి, అతను దేశ విద్రోహ శక్తులకు పాల్పడుతున్నట్లు అనుమానం ఉందని, దానికి సంబంధించిన పూర్తి వివరాలు హోం శాఖ కార్యదర్శికి పంపిన తర్వాతే ఫోన్ ట్యాపింగ్ చేయాలని తెలిపారు. కానీ వీటిని ఎక్కడా పాటించకుండా, చట్టాలను గౌరవించకుండా గత ప్రభుత్వం పాలన సాగించిందన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కల్గించడమే అన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్‎ను కలిసి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా కోరతానన్నారు. ఇందులో ఎవరు ఉన్నా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేస్తానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...