Telangana: ‘చెంప పగులగొట్టాలనిపిస్తోంది’.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి మహిళా నేత వార్నింగ్..
మంత్రి కొండ సురేఖ ముందే మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి అవమానం జరిగింది. నీలం మధు చంప పగల్గొట్టాలని ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కాట సుధా రాణి. నేరుగా మంత్రికి చెప్పడంపై తీవ్ర దుమారం రేగుతోంది. గత కొద్దిరోజులుగా నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు కొనసాగుతోంది.
మంత్రి కొండ సురేఖ ముందే మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకి అవమానం జరిగింది. నీలం మధు చంప పగల్గొట్టాలని ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ భార్య కాట సుధా రాణి. నేరుగా మంత్రికి చెప్పడంపై తీవ్ర దుమారం రేగుతోంది. గత కొద్దిరోజులుగా నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరి నేతలు ప్రయత్నాలు చేశారు. మొదట కాట శ్రీనివాస్ టికెట్ ఇచ్చి.. మళ్ళీ నీలం మధుకి టికెట్ కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. కాట వర్గం ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ఎమ్మెల్యే టికెట్‌ని నీలం మధుకి కాకుండ కాట శ్రీనివాస్‌కి ఇచ్చింది.
అప్పటి నుండి ఇద్దరి నేతల మధ్య గ్యాప్ పెరిగింది. బీఎస్పీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నీలం.. ఎన్నికల సమయంలో కాట శ్రీనివాస్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అవన్నీ బుధవారం మంత్రి కొండా సురేఖ ముందు ఏకరువు పెట్టారు కాట శ్రీనివాస్ భార్య సుధారాణి. నీలం మధు ముందే.. తన భర్తని ఎన్నికల సమయంలో ఎన్నో మాటలు అన్న నీలం మధు చంప పగలగొట్టాలి అనుకున్నా అని చెప్పారు. ఈ మాటలు విన్న నీలం మధు అవమానంతో తలదించుకున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ పక్కనే నిల్చోని మౌనంగా ఉండిపోయారు. ఈ సీన్ కట్ చేస్తే.. సుధారాణి మాటలు విన్న మంత్రి కొండా సురేఖ ఇద్దరికీ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా సుధారాణి వినకుండా నీలం మధును తీవ్రంగా విమర్శించారు. ఎంపీ అభ్యర్థి నీలం మధు గెలుపులో కాటా శ్రీనివాస్ గౌడ్ సహాయం చేయరంటూ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..