AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS SA-2 Exams Postponed: తెలంగాణ ఎస్ఏ-2 ప‌రీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ప్రకటించిన విద్యాశాఖ‌

తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒక‌టి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు త్వరలో నిర్వహించనున్న సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ - 2 ప‌రీక్షల‌ను వాయిదా వేసింది. దీంతో ఈ ప‌రీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం (ఏప్రిల్‌ 4) ప్రక‌టించారు. తాజా ప్రకటన ప్రకారం సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ..

TS SA-2 Exams Postponed: తెలంగాణ ఎస్ఏ-2 ప‌రీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ప్రకటించిన విద్యాశాఖ‌
TS SA-2 Exams Postponed
Srilakshmi C
|

Updated on: Apr 04, 2024 | 6:35 PM

Share

హైద‌రాబాద్, ఏప్రిల్‌ 4: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒక‌టి నుంచి తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కు త్వరలో నిర్వహించనున్న సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ – 2 ప‌రీక్షల‌ను వాయిదా వేసింది. దీంతో ఈ ప‌రీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం (ఏప్రిల్‌ 4) ప్రక‌టించారు. తాజా ప్రకటన ప్రకారం సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వ‌ర‌కు నిర్వహించ‌నున్నట్లు పేర్కొన్నారు. ఇక ఏప్రిల్‌ 23వ తేదీన ఈ పరీక్షలకు సంబంధించిన ఫ‌లితాలు ప్రక‌టించనున్నారు. అనంతరం ఏప్రిల్‌ 24వ తేదీన విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌తో స‌మావేశం నిర్వహించి, ఆ మరుసటి రోజు నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు.

ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఒక‌టో తరగతి నుంచి ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు గల విద్యార్ధులకు ఉద‌యం 9 గంట‌ల నుంచి 11.30 గంట‌ల వ‌రకు ప‌రీక్షలు నిర్వహిస్తారు. ఇక 8వ త‌ర‌గ‌తి విద్యార్ధులకు ఉద‌యం 9 నుంచి 11.45 గంట‌ల వ‌ర‌కు, తొమ్మిదో త‌ర‌గ‌తి విద్యార్ధులకు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. ఈ మేరకు ఎస్ఏ – 2 ప‌రీక్షల వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. డీఈవోలు, స్కూళ్ల యాజమన్యాలు, విద్యార్థులు ఈ విషయాన్ని గ‌మ‌నించాల‌ని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

కాగా 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒంటి పూట బడులు జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 24వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. వేసవి సెలవులు ముగిసేలోపు సార్వత్రిక ఎన్నికలు కూడా ముగించేలా ఈసీలు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి విద్యాశాఖ మొత్తం 45 రోజులు వేసవి సెలవులు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు