Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JEE Main 2024 session 2: జేఈఈ మెయిన్స్‌ తుది విడత పరీక్షలు ప్రారంభం.. డ్రెస్‌ కోడ్‌ తప్పక పాటించవల్సిందే

దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది విడత 2024 పరీక్షలు గురువారం (ఏప్రిల్‌ 4) నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే పరీక్షలకు మొదటి సెషన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి . మొత్తం ఆరు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అధికారుల ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు..

JEE Main 2024 session 2: జేఈఈ మెయిన్స్‌ తుది విడత పరీక్షలు ప్రారంభం.. డ్రెస్‌ కోడ్‌ తప్పక పాటించవల్సిందే
JEE Main 2024 session 2
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2024 | 2:46 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశ వ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ తుది విడత 2024 పరీక్షలు గురువారం (ఏప్రిల్‌ 4) నుంచి ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే పరీక్షలకు మొదటి సెషన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి . మొత్తం ఆరు రోజుల పాటు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు ఎన్టీఏ అధికారుల ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం మొదటి సెషన్‌ పరీక్ష పూర్తి కాగా మరికొద్ది నిమిషాల్లో రెండో సెషన్‌ పరీక్ష ప్రారంభం కానుంది. దీంతో రెండు గంటల ముందే విద్యార్ధులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల తర్వాత, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఒక్క నిమిషయం ఆలస్యమైన విద్యార్ధులను ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని ఇప్పటికే ఎన్టీయే స్పష్టం చేసింది. పరీక్ష కేంద్రాలకు హాల్‌టికెట్‌తోపాటు అడ్మిట్‌ కార్డు, ఏదైనా ఒకటి ప్రభుత్వ గుర్తింపు కార్డుతో హాజరు కావల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, బంగారు ఆభరణాలు, మొబైల్‌ ఫోన్లు, చేతి గడియారాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.

పరీక్షలు జరిగే అన్ని రోజుల్లో ఈ కింది డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరిగా పాటించవల్సి ఉంటుంది..

  • దుస్తులకు ఎలాంటి పాకెట్స్ లేకుండా వదులుగా ఉండే దుస్తులు మాత్రమే ధరించాలి.
  • దుస్తులపై రకరకాల మెటాలిక్స్ డిజైన్లు ఉంటే అనుమతించరు.
  • అలాగే అమ్మాయిలు స్కార్ఫ్‌లు, మఫ్లర్‌లు ధరించి రాకూడదు. షాల్స్, టోపీలు, స్టోల్స్, రంగురంగుల కళ్ళజోడులు ధరించి రాకూడదు.
  • షూ, మందంగా, ఎత్తుగా ఉండే చెప్పులు ధరించిన వారికి అనుమతి ఉండదు.
  • ఎలాంటి లోహాలతో కూడిన వస్తువులు శరీరంపై ధరించకూడదు.
  • ఉంగరాలు, గాజులు వంటి ఆభరణాలు, నగలు లేకుండా రావాలి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.