SSC GD Constable Answer Key: కానిస్టేబుల్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే?

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టులకు సంబంధించి నిర్వహించిన నియామక రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఎస్సెస్సీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్‌ 'కీ'పై అభ్యంతరాలను లేవనెత్తేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని..

SSC GD Constable Answer Key: కానిస్టేబుల్ పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్‌ 'కీ' విడుదల.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
SSC GD Constable Answer Key
Follow us

|

Updated on: Apr 04, 2024 | 2:26 PM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టులకు సంబంధించి నిర్వహించిన నియామక రాత పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ విడుదలైంది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఎస్సెస్సీ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్‌ రాత పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ కీ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’పై అభ్యంతరాలను లేవనెత్తేందుకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలని కమిషన్‌ స్పష్టం చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీని ఫలితాలతోపాటు ఏప్రిల్‌ చివరి వారంలో లేదా మే నెలలో వెల్లడించున్నట్లు తెల్పింది.

కాగా ఈ నోటిఫికేషన్‌ కింద దేశ వ్యాప్తంగా CISF, CRPF, ITBP, BSF, AR, SSB, SSF ఫోర్సుల్లో మొత్తం 26,146 జనరల్‌ డ్యూటీ కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రాత పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 12వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాతపరీక్ష ఫలితాల అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్‌ తదితర పరీక్షల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఆంధ్రప్రదేశ్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల ఇంటర్‌ ప్రవేశ పరీక్ష 2024 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాసంస్థల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించని ఎంట్రన్స్‌ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రావిరాల మహేశ్‌కుమార్‌ బుధవారం (ఏప్రిల్‌ 3) ఓ ప్రకటనలో వెల్లడించారు. గురుకులాల్లో జూనియర్‌ ఇంటర్‌ ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40,853 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 35,629 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంబేడ్కర్‌ గురుకుల జూనియర్‌ కాలేజీల్లో బాలికలకు 9280 సీట్లు, బాలురకు 4280 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఆయా గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.