TS 10th Class Result Date: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం షురూ.. ఫలితాలు ఎప్పుడంటే

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీతో ముగిశాయి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పలు జిల్లాల నుంచి సేకరించిన జవాబు పత్రాలను అధికారులు స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. జవాబు పత్రాల కోడింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోగా పూర్తి చేయాలని..

TS 10th Class Result Date: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం షురూ.. ఫలితాలు ఎప్పుడంటే
TS 10th Class Result Date
Follow us

|

Updated on: Apr 03, 2024 | 6:57 PM

హైదరాబాద్, ఏప్రిల్‌ 3: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 2వ తేదీతో ముగిశాయి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పలు జిల్లాల నుంచి సేకరించిన జవాబు పత్రాలను అధికారులు స్ట్రాంగ్‌ రూంలలో భద్రపరిచారు. జవాబు పత్రాల కోడింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. నేటి నుంచి ప్రారంభమైన మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ రెండో వారంలోగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియ అనంతరం పదో తరగతి ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఫలితాల ప్రాసెసింగ్ మరో రెండు వారాల పాటు కొనసాగుతుంది. కాగా 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తగా 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో నిర్వహించగా.. అక్కడక్కగా కొన్ని మాల్‌ ప్రాక్టీస్‌ సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 2,676 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 2,676 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులతో పాటు 30,000 మంది ఇన్విజిలేటర్లను విద్యాశాఖ నియమించింది.

పరీక్షల పర్యవేక్షణ, అవకతవకలను నివారించడానికి 144 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా నియమించారు. పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పోర్టల్ నుంచి రిజల్ట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
కట్టుకున్న భార్యకు మూడు పెళ్లిళ్లు చేయించిన భర్త..
చేపల పొట్టల్లో కొకైన్‌.. డ్రగ్స్‌తో బ్రెజిల్‌ తీరం కలుషితం
చేపల పొట్టల్లో కొకైన్‌.. డ్రగ్స్‌తో బ్రెజిల్‌ తీరం కలుషితం
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే
షాకింగ్ న్యూస్.. 'డెవిల్' కోసం మహేష్.. కానీ డైరెక్టరే
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్
గేదెను చూపించి దానిమీద కూర్చోవాలన్నాడు.. షాకైన హీరోయిన్
50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
50 ఏళ్ల వయసులో.. ముచ్చటగా 3వ సారి ప్రేమలో పడిన మలైకా !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
డబ్బులిచ్చి పొగిడించుకుంటావ్‌ !! హీరోయిన్ .. క్రేజీ ఆన్సర్ !!
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
తల్లిని కావాలనుకున్నాను !! అమితాబ్ ఒకప్పటి ప్రియురాలి ఆవేదన
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
పొట్టి బట్టలతో బరితెగించావంటూ తిట్లు.. దిమ్మతిరిగే ఆన్సర్
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
చరిత్ర సృష్టించిన షారుఖ్.. తొలి భారతీయ నటుడిగా అరుదైన గౌరవం
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు
ఇది హీరోతనం అంటే !! చేతులెత్తి మొక్కేలా చేసుకున్న బెల్లంకొండ బాబు