APPSC Group 2 Result Date: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల తేదీ ఇదే.. 1:100 నిష్పత్తిలో ఫలితాలు వెలువడేనా?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 24 జిల్లాల్లో దాదాపు 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష జరిగి 2 నెలలు గడుస్తోన్న ఫలితాలు మాత్రం ఇంకా వెడువల లేదు. దీంతో అభ్యర్ధులు ఎప్పుడెప్పుడు ఫలితాలు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 13వ తేదీ లోగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం..
అమరావతి, ఏప్రిల్ 3: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఈ ఏడాది ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 24 జిల్లాల్లో దాదాపు 1327 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష జరిగి 2 నెలలు గడుస్తోన్న ఫలితాలు మాత్రం ఇంకా వెడువల లేదు. దీంతో అభ్యర్ధులు ఎప్పుడెప్పుడు ఫలితాలు ప్రకటిస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 13వ తేదీ లోగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను ఏపీపీఎస్సీ సాధారణంగా 1:50 నిష్పత్తిలో ప్రకటిస్తుంది. అయితే ఈ సారి నిర్వహించిన గ్రూప్ ప్రిలిమ్స్ ఫలితాలను మాత్రం 1:100 నిష్పత్తిలో ఫలితాలు ప్రకటించాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు.
గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీకి, ప్రిలిమ్స్ పరీక్ష తేదీ మధ్య తక్కువ సమయం ఉందని, సన్నద్ధతకు మయం సరిపోకపోవడంతోపాటు ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని వాపోతున్నారు. పైగా ఇండియన్ సొసైటీ చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లోకి ఆలస్యంగా రావడం వంటి ఇబ్బందుల కారణంగా ఆశించిన స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించాలని అభ్యర్ధులు కోరుతున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీకి పలువురు అభ్యర్ధులు తమ అభ్యర్థనలు పంపిస్తున్నారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రిలిమ్స్ ఫలితాల విడుదలనాటికి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కూడా ఇదే విధమైన అభ్యర్ధనలు వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్ రాసేందుకు అభ్యర్థులను ఎంపిక చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అంతేకాకుండా క్వశ్చన్ పేపర్‌లో ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి అనువదించిన పలు ప్రశ్నలు తప్పుల తడికగా ఉన్నాయని, సన్నద్ధతకూ తగిన సమయం లేకపోవడం కారణాల వల్ల మెయన్స్ పరీక్ష ఎక్కువ మంది రాసేందుకు వీలు కల్పించాలని అభ్యర్ధులు కోరుతున్నారు. ఇక ఈ అభ్యర్ధనలపై కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.