Hyderabad: వెజ్ స్పెషల్ రోల్ ఆర్డర్ పెడితే.. పార్శిల్ వచ్చింది.. తినేందుకు ఓపెన్ చేయగా..
ఓ కస్టమర్ తనకిష్టమైన వెజ్ స్పెషల్ రోల్ స్విగీల్లో ఆర్డర్ పెట్టారు. అయితే పార్శిల్ రావడం చాలా లేట్ అయింది. మరీ లేటు అయితే.. ఫుడ్ వేడి తగ్గిపోతుందేమో అని భావించి.. వెంటనే దాన్ని ఓపెన్ చేసి ఓ బైట్ కొరికారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. వెజ్ రోల్‌లో చికెన్ కనిపించింది.. కట్ చేస్తే....
వెజిటేరియన్స్ కొందరు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. తమ చుట్టుపక్కల ఎవరైనా నాన్ వెజ్ తింటున్నా.. అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారు. కోళ్లను, మేకలు, గొర్రెలను చంపి తినడం వారు పాపంగా పరిగణిస్తారు. అలాంటి ఓ శాఖాహారి.. వెజ్ ఫుడ్.. ఆర్డర్ పెడితే.. నాన్ వెజ్ ఫుడ్ అందిస్తే ఊరుకుంటారా చెప్పండి. ఏకంగా లీగల్ నోటీసు ఇవ్వడంతో పాటు వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసును విచారించిన కన్జూమర్ ఫోరం.. శాఖాహారికి ‘మాంసాహారం’ డెలివరీ చేసినందుకు కస్టమర్‌కు 10,000 రూపాయలు పరిహారం చెల్లించాలని హైదరాబాద్‌లోని ఒక రెస్టారెంట్‌తో పాటు ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీని ఆదేశించింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్ నివాసి అయిన శ్రుతి బహేతి, రెస్టారెంట్ నుండి స్విగ్గీ ద్వారా వెజ్ స్పెషల్ రోల్ ఆర్డర్ చేశారు. ఆర్డర్ 54 నిమిషాలు ఆలస్యం కావడమే కాకుండా, రోల్‌లో చికెన్ ముక్కలు కూడా ఉన్నాయని, దానిని తినడం ప్రారంభించిన తర్వాతే.. వాటిని గమనించానని ఆమె ఆరోపించింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె.. లీగల్ నోటీసు పంపడమే కాకుండా వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది.
ఫిర్యాదుదారు చేసిన క్లెయిమ్‌లకు రిప్లై ఇస్తూ.. ఆర్డర్ చేసిన ఆహారాన్ని సిద్ధం చేయడం అనేది రెస్టారెంట్ బాధ్యత అని.. అలానే సీల్డ్ ప్యాక్‌ను డెలివరీ వర్కర్‌కు రెస్టారెంట్ సిబ్బందే అప్పగించారని Swiggy వాదించింది. మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ రెస్టారెంట్ కూడా తమ వెర్షన్ వినిపించింది. తాము పంపిన రోల్‌లో పనీర్ బుర్జీ, సోయా చాప్, మష్రూమ్, సోయా షమ్మీ కబాబ్ ఉన్నాయని పేర్కొంది. అయితే ఫిర్యాదుదారు సమర్పించిన సాక్ష్యాలను విశ్లేషించిన కమీషన్.. రోల్‌లో చికెన్ ముక్కలు ఉన్నట్లు నిర్ధారించింది. శాఖాహారులకు మాంసాహారం అందించడం, సేవలలో జాప్యం, సేవల లోపంగా పరిగణించి రూ. 10,000 ఫైన్ వేశారు. అదనంగా, రూ. 5,000 ఖర్చుల కింద ఫిర్యాదుదారుకు చెల్లించాలని సదరు రెస్టారెంట్‌తో పాటు స్విగ్గీని.. వినిమోగదారుల కమిషన్ ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి