అటు ఐపీఎల్ జోరు.. ఇటు ఎన్నికల హోరు.. కాయ్ రాజా కాయ్.. ఖేల్ ఖతం బాబాయ్..

తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ ఫీవర్ కుదిపేస్తోంది. చిన్నా, పెద్దా అని తేడా లేదు.. ఎవరి స్థాయిలో వారు ఐపీఎల్‌పై బెట్టింగ్స్ వేస్తున్నారు. క్రికెట్‌ అంటే బెట్టింగ్.. బెట్టింగ్ అంటే క్రికెట్ అనేలా పరిస్థితి తయారైంది. కళ్లు చెదిరే సిక్సులు.. అద్భుతమైన ఆటతీరు.. ఫ్యాన్స్‌కు వినోదాన్ని ఇస్తే, బెట్టింగ్ రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది.

అటు ఐపీఎల్ జోరు.. ఇటు ఎన్నికల హోరు.. కాయ్ రాజా కాయ్.. ఖేల్ ఖతం బాబాయ్..
Online Betting
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 04, 2024 | 7:58 PM

తెలుగు రాష్ట్రాలను బెట్టింగ్ ఫీవర్ కుదిపేస్తోంది. చిన్నా, పెద్దా అని తేడా లేదు.. ఎవరి స్థాయిలో వారు ఐపీఎల్‌పై బెట్టింగ్స్ వేస్తున్నారు. క్రికెట్‌ అంటే బెట్టింగ్.. బెట్టింగ్ అంటే క్రికెట్ అనేలా పరిస్థితి తయారైంది. కళ్లు చెదిరే సిక్సులు.. అద్భుతమైన ఆటతీరు.. ఫ్యాన్స్‌కు వినోదాన్ని ఇస్తే, బెట్టింగ్ రాయుళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈజీ మనీ మోజులో పడి.. వేలాది మంది బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుని తమ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. కొందరు ప్రాణాలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ దందా కామన్‌ అయిపోయింది. ప్రధాన నగరాలే కేంద్రంగా.. పెద్ద ఎత్తున నెట్వర్క్ విస్తరింపజేస్తున్నాయి కొన్ని ముఠాలు. పోలీసులకు చిక్కినా మళ్లీ బయటకు వచ్చాక ఇదే దందా కంటిన్యూ చేస్తున్నారంటే.. సంపాదన ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్ ద్వారా చేసే స్కాములు నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయి.

ఒక జట్టు మీద బెట్టింగ్ వేసిన తర్వాత సదరు టీమ్ ఓడిపోతుందన్న సమయంలో వేరొక జట్టుపైకి బెట్టింగ్ మార్చడానికి అవకాశం లేని విధంగా సర్వర్‌ని ఆఫ్ చేస్తారు. ఉదాహరణకు A జట్టు ఫేవరెట్‌గా ఉన్న సందర్భంలో ఒక రూపాయికి 70 పైసలు ఇస్తూ వేరొక జట్టు Bకి 70 పైసలకు.. రూపాయి వచ్చేటట్లు యాప్‌లో బెట్టింగ్‎కి అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా ముఠాలో ప్రముఖ వ్యక్తులు బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్న సమయంలో లేదా మ్యాచ్ గెలుస్తుందన్న సమయంలో వాళ్ళ స్వలాభం కోసం సదరు అప్లికేషన్, వెబ్సైట్‎ని వాళ్ళు నచ్చిన విధంగా ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేత బాధితులు ఎక్కువగా నష్టపోతున్నారు.

ఎలక్షన్ బెట్టింగ్స్ కూడా షురూ..

క్రికెట్ బెట్టింగ్ అలా ఉండగా.. మరోవైపు పొలిటికల్ బెట్టింగ్ కూడా షురూ అయింది. NDA 400 సీట్లు కొడుతుందని.. ఏపీలో గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎవరు..? అంటూ బెట్టింగ్స్ నడుస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెబుతూ బెట్టింగ్స్ కాస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములపైనే కొందరూ బెట్టింగ్‌ వేస్తుంటే.. మరికొందరూ మెజార్టీపై పందాలు వేస్తున్నారు. హాట్‌ ఫేవరెట్‌పై 10 వేలు పెడితే లక్ష ఇచ్చేట్లుగా పందాలు కాస్తున్నారు. స్ట్రీట్ వెండర్స్ నుంచి బడాబాబుల దాకా.. వందల కోట్లు చేతులు మారుతున్నాయి. ఈ బెట్టింగ్స్ కోసం ప్రత్యేక కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు నిర్వాహకులు. మందు, విందు, చిందు అక్కడ అన్నీ ఉండేలా.. బెట్టింగ్ వేసే వారిని పందెంరాయుళ్లు అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలా ఈ రెండు నెలల్లో అటు ఐపీఎల్, ఇటు ఎలక్షన్స్ కారణంగా వేల కోట్లు చేతులు మారే అవకాశం ఉంది. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడతాయి. పోలీసులు స్పెషల్ టీమ్స్‌ను రంగంలోకి దించింతే కొంతమేర డ్యామేజ్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ప్రజలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.
సెంటిమెంట్‌ను పట్టించుకోని తండ్రీకొడుకులు.! వారికీ ఇదో బోనస్.